»   » బన్ని కోటి లైక్స్‌ ...వెనుక మిస్టరీ ఇదే

బన్ని కోటి లైక్స్‌ ...వెనుక మిస్టరీ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్‌ ఫేస్‌బుక్‌ పేజీని లైక్‌ చేసిన అభిమానుల సంఖ్య కోటికి చేరింది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు స్టార్‌ అల్లు అర్జున్‌ కావడం విశేషం. ఈ పేజీని అల్లు అర్జున్‌ అనుమతితో ఆయన అభిమానులు నిర్వహిస్తున్నారు.

తన సినిమాలకు, జీవితానికి సంబంధించిన అనేక అంశాలను అభిమానులతో పంచుకోవడానికి అల్లు అర్జున్‌ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లను వేదికలుగా ఉపయోగించుకుంటున్నారు.

Allu Arjun gets 1 Cr fans on Facebook

కోటి లైక్‌ల మార్క్‌ను చేరుకుని దూసుకుపోవడటానికి కారణం.... బ‌న్నీకి యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు అతనికి కేరళ,తమిళనాడు, కర్ణాటక భాషల్లో మార్కెట్ ఉండటం కూడా మరో కారణం అయ్యింది.

తనదైన మ్యానరిజమ్, యాక్టింగ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక సౌతిండియాలోని అన్ని రాష్ట్రాల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ స్టార్, తాజాగా సోషల్ మీడియాలో ఏ సౌతిండియన్ హీరోకూ సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు.

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఫేస్‌బుక్‌లో అల్లు అర్జున్ అఫీషియల్ ఎకౌంట్‌కు కోటి లైకులు వచ్చాయి. కొద్దిసేపటి క్రితమే బన్నీ ఫేస్‌బుక్ అకౌంట్ 10 మిలియన్ మార్క్‌ను చేరుకుంది.

Allu Arjun gets 1 Cr fans on Facebook

సౌతిండియన్ సినిమాకు సంబంధించి ఏ స్టార్‌ హీరోకు ఫేస్‌బుక్‌లో ఈ స్థాయిలో ఫాలోయింగ్ లేకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. తన సినిమా విశేషాలనే కాక, పండగ సంబరాలు, ఇంట్లో జరిగే వేడుకలకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ బన్నీ, ఫేస్‌బుక్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వస్తున్నారు.

ముఖ్యంగా అల్లు అర్జున్ తనయుడు అయాన్ ఫోటోలకు బన్నీ ఫేస్‌బుక్‌లో ఓ రేంజ్ క్రేజ్ ఉండడాన్ని ప్రత్యేకంగా చూడొచ్చు. ఇక ఇటు వరుసగా సినిమాలతోనే కాక, సోషల్ మీడియాలోనూ ట్రెండ్ సృష్టిస్తూ అల్లు అర్జున్ తన అభిమానులకు కొత్త ఉత్సాహాన్నిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సరైనోడు' చిత్రం తెరకెక్కుతోంది.

English summary
Allu Arjun is now the first South Indian hero to clock one crore followers on social media site Facebook. Besides Andhra Pradesh and Telangana, Allu Arjun has huge fan following in states like Kerala, Karnataka, Chennai, and which eventually made him the most loved actor among his contemporaries
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu