»   » మొత్తం సౌత్ ఇండియాపై కన్నేసిన అల్లు అర్జున్

మొత్తం సౌత్ ఇండియాపై కన్నేసిన అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్వరలో ఒక ఇంటి వాడు కోబోతున్న అల్లు అర్జున్‌‌కి మళయాలంలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికి తెలిసిందే. తాజాగా తాను మళయాలంలోనే కాకుండా, కన్నడలో కూడా ఫాలోయింగ్‌ని సంపాదించుకోవడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా కర్ణాటక అన్న కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తృతీయ పుత్రుడు పునీత్ రాజ్ కుమార్‌తో అల్లు అర్జున్ తిరుగుతున్నాడు. ఇది మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ నటించి అక్కడ ఘనవిజయం సోంతం చేసుకున్నటువంటి జాకీ సినిమాని తెలుగులోకి విడుదల చేయడానికి ముఖ్య కారణం అల్లు అర్జున్ ప్రోత్సాహమే ముఖ్య కారణమని సమాచారం.

హైదరాబాద్‌కు పునీత్ రాజ్ కుమార్‌ని రప్పించడం, అతనితో అల్లు అర్జున్ రాసుకుపూసుకు తిరగడం తెలిసిన విషయమే. తన తండ్రి నిర్మిస్తున్నటువంటి తన తాజా చిత్రం బద్రినాధ్ సినిమాని కన్నడలో విడుదల చేయాలని భావిస్తున్నటువంటి అల్లు అర్జున్ ముందుగానే స్కేచ్ ప్రకారం కన్నడ సినీ రంగంలో తిరుగులేనటువంటి ఫాలోయింగ్ ఉన్నటువంటి రాజ్ కుమార్ ప్యామిలీని పట్టడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం అని అంటున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీకి పునీత్ రాజ్ కుమార్‌ని అల్లు అర్జున్ ప్రమోట్ చేస్తే, కన్నడలో రాజ్ కుమార్ ఫ్యామిలీ అల్లు అర్జున్‌‍ని ప్రమోట్ చేయనుందని సమాచారం. ఏది ఏమైతేనేం అల్లు అర్జున్‌ని ఎంటైర్ సౌత్ ఇండియా పేరు ప్రఖ్యాతులు కోసం అల్లు అరవింద్ వెనకుండి మరీ నడిపిస్తున్నారనేది మరో సమాచారం. ఇది మాత్రమే కాకుండా అల్లు అరవింద్ మీద ఉన్న మమకారంతో సోదరుడిని నిర్మాతగా కూడా ఎదగనివ్వని చిరంజీవి ఇప్పుడు బావ అల్లు అరవింద్ సలహా మీద మరోసారి తమ్ముడు నాగబాబుకి అన్యాయం చేస్తున్నాడని గుసగుసలు ఫిలిం నగర్‌లో వినిపిస్తున్నాయి. తన కొడుకు వరుణ్ తేజ్‌ని కూడా హీరోగా పరిచయం చేయాలని నాగబాబు తహాతహాలాడుతుంటే చిరంజీవి ఏదో ఒక కుంటి సాకులు చెప్పి వద్దని వారిస్తున్నాడని సమాచారం.

ఇప్పటికే తన కుటుంబం నుండి హీరోలు బాగా ఎక్కువై పోయారని, అందుకే వరుణ్ తేజ్‌ని తెలుగు సినిమాకి పరిచయం చేసే అరంగేట్రాన్ని మరికొంత కాలం ఆలస్యం చేస్తే బాగుంటుందని చిరంజీవి అన్నట్లు సమాచారం. దీనికి అంతటికి కారణం అల్లు అరవిందేనని అనుకుంటున్నారు. అల్లు అర్జున్‌కి పోటీగా రామ్ చరణ్ దిగడంతోనే అభద్రతాభావంతో ఉన్న అల్లు అరవింద్ ఇప్పుడు కొత్తగా వరుణ్ తేజ్‌ని కూడా తీసుకొస్తే తన కొడుకుకి మరింత డ్యామేజి జరుగుతుందని భయంతోనే చిరంజీని చేత ఈపని చేయించాడని గుసగుసలు ఫిలిం నగర్‌లో వినిపిస్తున్నాయి.

English summary
Puneet Rajkumar's movie Jackie, which has become a blockbuster film in Kannada in 2010, is now being dubbed in Telugu. The audio CD of the Telugu version was recently released at a function held in Hotel Das Palla, Hyderabad. Tollywood star Allu Arjun unveiled the first audio CD and handed it over to another superstar of Telugu, Akkineni Nageswara Rao, who has been a close friend of Late Dr. Rajkumar Family.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X