»   » సరైనోడు: అభిమానిని పరామర్శించిన హీరో అల్లు అర్జున్

సరైనోడు: అభిమానిని పరామర్శించిన హీరో అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయవాడ: తెలుగు హీరో అల్లు అర్జున్ తన అభిమాని పట్ల అత్యంత దయాగుణం ప్రదర్శించాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమానిని ప్రదర్శించి తన బాధ్యతను నిరూపించుకున్నాడు. విజయవాడలోని సింగ్ నగర్‌లో ఉంటున్న మస్తాన్ బీ 50 ఏళ్లుగా అల్లు రామలింగయ్య అభిమాని.

ఆ తర్వాత అదే కుటుంబం నుంచి వచ్చిన అల్లు అర్జున్‌ను ఆమె అభిమానిస్తోంది. ప్రస్తుతం ఆమె క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆమె ఎక్కువ కాలం బతికే అవకాశం కూడా లేదని వైద్యులు చెప్పారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఒక్కసారైనా తన అభిమాన నటుడిని చూడాలని ఆమె కోరుకుంటోంది.

 Allu Arjun met his terminally ill fan at vijayawada

విజయం తెలుసుకున్న అల్లు అర్జున్ మంగళవారంనాడు విజయవాడ వెళ్లి మస్తాన్ బీని కలిసి పరామర్శించారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సరైనోడు సినిమాల్లో నటిస్తున్నాడు. షూటింగ్‌కు కాస్తా గ్యాప్ రావడంతో స్వయంగా బన్నీ విజయవాడ వచ్చి మస్తాన్ బీని పలకరించాడు.

మస్తాన్ బీ కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్ కాసేపు గడిపాడు. గతంలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా అనారోగ్యంతో బాధపడుతున్న తమ తమ అభిమానులను కలిసి ఓదార్పు మాటలు చెప్పారు.

English summary
Allu Arjun fulfills the last wish of 67 year old Mastan Bee! She was suffering from cancer and her last wish was to meet Allu Arjun. Allu Arjun rescheduled his shooting schedules and took a flight to Vijayawada to meet her this morning and fulfill her last wish.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu