»   » అల్లు అర్జున్ కుమారుడు పేరు..దాని అర్దం

అల్లు అర్జున్ కుమారుడు పేరు..దాని అర్దం

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Allu Arjun names his son Ayaan
  హైదరాబాద్ ‌: ఈ నెల 4న అల్లు అర్జున్‌, స్నేహ దంపతులకు మగబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. . ఆ బాబుకి అయాన్‌ అనే పేరు పెట్టారు. అయాన్ అంటే... దివ్యమైనది(సంస్కృతం), దేవుని బహుమతి(అరబిక్),గుర్తు పెట్టుకోవాల్సింది(పర్షియన్)భాషల్లో అర్దాలు ఉన్నాయి. ఏదైమైనా ఈ బాబు పుట్టగానే అల్లు అర్జున్ కి పెద్ద హిట్ సినిమా రేసుగుర్రం రావటం జరిగింది.

  ఇక అల్లు అర్జున్ తాజా చిత్రం "రేసు గుర్రం" 1050 థియోటర్స్ తో ప్రపంచవ్యాప్తంగా మొన్న శుక్రవారం విడుదల అయ్యింది. మార్నింగ్ షోకే ఈ చిత్రం హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే ఓపినింగ్స్ సైతం అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ అన్న రీతిలో వచ్చాయి.

  "పరుగు పందెంలో గెలవడం రేసుగుర్రం విధి. జీవితమనే పరుగు పందెంలో గెలవడం మనిషి విధి. అయితే... ఈ రేసులో అడపాదడపా గెలిచేవారు కొందరైతే... గెలుపుని ఇంటిపేరుగా మార్చుకున్నవాళ్లు కొందరు. ఆ కొందరిలో ఒకడి కథే... 'రేసుగుర్రం. బాధ్యతాయుతమైన ఓ యువకుని కథాంశంతో సురేందర్‌రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తిమంతమైన పాత్ర పోషించారు"

  సురేంద్రరెడ్డి మాట్లాడుతూ..."గెలుపు కోసం బరిలో దిగినవాడికి... లక్ష్యం మాత్రమే కనిపించాలి. ఎదురొస్తున్న సవాళ్లు, పరిగెట్టిస్తున్న పరిస్థితులు, చుట్టుముడుతున్న సమస్యలూ ఇవేమీ పట్టించుకోకూడదు. రేసులో నిలవాలన్నా, నిలిచి గెలవాలన్నా పోరాడాల్సిందే. ఆ యువకుడూ అదే చేశాడు. 'రేసు గుర్రం'లా దూసుకుపోయాడు. మరి విజయం అందిందా? లేదా? ఇంతకీ ఈ రేసు దేని కోసం? తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే!" అన్నారు

  నిర్మాతలు మాట్లాడుతూ... "బన్ని కెరీర్‌లో ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. ఆద్యంతం నవ్వులు పండిస్తూనే ఉంటుంది. వినోదం, యాక్షన్‌ మేళవించిన కథ ఇది. టైటిల్‌కి తగ్గట్టే.. హుషారుగా సాగిపోతుంది'' అని అన్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు!" అన్నారు

  English summary
  
 Allu Arjun's son, who was born on April 4, has been named as 'Ayaan'. The news has been confirmed by Allu Arjun's spokesperson a little while ago on a micro-blogging page. The word 'Ayaan' has multiple meanings including soaked in the divine (Sanskrit), god's gift (Arabic), notable (Persian). Considering the fact that Ayaan has brought in loads of luck to his papa, he is God's gift indeed.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more