»   » అల్లు అర్జున్ పుట్టిన రోజునే సెట్స్ మీదకా? నమ్మొచ్చా?

అల్లు అర్జున్ పుట్టిన రోజునే సెట్స్ మీదకా? నమ్మొచ్చా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ ప్రస్తుతం 'దువ్వాడ జగన్నాథం' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తితో వున్నారు. బన్నీ పుట్టినరోజైన ఏప్రిల్ 8వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత పెద్ద గ్యాప్ లేకుండానే రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెడతారట. దర్శకుడిగా వక్కంతం వంశీ కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి మరి. వివరాల్లోకి వెళితే...

అభిమానుల్లో ఆసక్తి:

అభిమానుల్లో ఆసక్తి:

అయితే ఈ సినిమా ఏ నేపథ్యంతో తెరకెక్కనుందనే ఆసక్తి అభిమానుల్లో రేకెత్తుతోంది. ఈ సినిమా దేశభక్తిను చాటిచెప్పే కథాంశంతో కొనసాగనుందనే టాక్ తాజాగా వినిపిస్తోంది. టైటిల్ లో ఆ అర్థం ధ్వనిస్తుంది కనుక .. దేశభక్తిని ప్రేరేపించే చిత్రమేనని అనుకోవడానికి బలం చేకూరుతోంది. అల్లు అర్జున్ పుట్టిన రోజైన ఏప్రిల్ 8వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయడానికి సన్నాహాలు మొదలెట్టారు.

ఏప్రిల్‌ 8న :

ఏప్రిల్‌ 8న :

ప్రస్తుతం హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో 'డీజే-దువ్వాడ జగన్నాథమ్‌' చిత్రంలో నటిస్తున్న అల్లు అర్జున్‌ ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారన్న సంగతి తెలిసిందే. ఇక చిత్రాన్ని ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభిస్తారని ఫిలింనగర్‌ సమాచారం.

భారీగా నిర్మించేందుకు:

భారీగా నిర్మించేందుకు:

ఈ సినిమానే దేశభక్తికి కేరాఫ్ ఎడ్రస్ గా వక్కంతం వంశీ కథని రెడీ చేసినట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో ఎక్కువ భాగం నార్త్ ఇండియాలో తీస్తారని తెలుస్తోంది.ఇంతకాలం తన ప్రొడక్షన్ లో లో బడ్జెట్ మూవీలనే తీసుకుంటూ వచ్చిన లగడపాటి శ్రీధర్ ఇప్పుడు బన్ని సినిమాను భారీగా నిర్మించేందుకు రెడీ అయ్యారు.

ఉత్సాహం మొదలైంది:

ఉత్సాహం మొదలైంది:

ఇక సినిమా టైటిల్ గా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అని రిజిస్టర్ చేయించారు. దాంతో అల్లు అర్జున్ సినిమా కోసమే ఈ టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు మీడియాలో ప్రచారం అవుతోంది. ఇకటైటిల్ ఇలా బయటకు వచ్చిదో లేదో అప్పుడే మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం మొదలైంది.

సోషల్ మీడియాలో ట్రెండింగ్:

సోషల్ మీడియాలో ట్రెండింగ్:

అంతేకాదు ఈ టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అని పవర్ ఫుల్ గా చెప్పే బన్ని సినిమాలో ఎలా ఉండబోతాడా అని ఫ్యాన్స్ ఎక్సయిటింగా ఉన్నారు. రైటర్ గా సూపర్ సక్సెస్ అయిన వక్కంత వంశీ బన్ని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కథ కచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుందని అంటున్నారు. మరి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తూందటం అభిమానులకి ఆనందమే కదా.

English summary
As Per Latest updates Allu Arjun Finalized next film Naaperu Surya Naaillu India shooting will starts from April 8th, on the eve of his birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu