For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్ 'బాహుబలి' లుక్ పై అల్లు అర్జున్ కామెంట్

  By Srikanya
  |

  హైదరాబాద్: ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న భారీ చిత్రం 'బాహుబలి' . ఈ చిత్రం లో ప్రభాస్ లుక్ ని చిత్రం టీమ్ రీసెంట్ గా విడుదల చేసింది. అందరి చేత ప్రశంసలు అందుకుంటున్న ఈ లుక్ పై అలు అర్జున్ సైతం పొగడ్తలు కురింపించేసాడు. తన ఫేస్ బుక్ పేజీలో అలు అర్జున్ ఈ విషయమై రాస్తూ మెచ్చుకున్నారు. అంతేకాకుండా పుట్టిన రోజు శుభాకాంక్షలు సైతం తెలియచేసాడు.

  అల్లు అర్జున్ రాస్తూ... "'బాహుబలి' గా ప్రభాస్ టెర్రిఫిక్ గా ఉన్నాడు. నా ప్రియమైన డార్లింగ్ ప్రబాస్ కు ముందస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు" అన్నారు. మరో ప్రక్క అల్లు అర్జున్ సైతం గోన గన్నారెడ్డిగా చారిత్రాత్మకమైన పాత్రలో కనిపిస్తున్నాడు. ఆ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా నే విడుదల చేసారు.

  ప్రస్తుతం...

  మొదటి నుంచీ అల్లు అర్జున్‌.. ఉత్సాహానికి మారు పేరు. చేసే ప్రతి పాత్రలోనూ కొత్తదనాన్ని చూపించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రేమికుడిగా, బాధ్యతలు నెత్తికెత్తుకున్న యువకుడిగా, దేశముదురుగా.. ఇలా వివిధ పాత్రలతో అలరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇతడు చారిత్రక నేపథ్యమున్న పాత్రలో కనిపించబోతున్నాడు. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న 'రుద్రమదేవి' చిత్రంలో అల్లు అర్జున్‌ గోన గన్నారెడ్డి చేయటంతో అతని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.

  Allu Arjun on Prabhas' look in Baahubali

  తెలుగుజాతి పౌరుషానికీ, కాకతీయ వీరత్వానికీ ప్రతీక గోనగన్నారెడ్డి. ఆ పాత్రలో అల్లు అర్జున్‌ ఒదిగిపోయిన తీరు మా చిత్రానికే ప్రధాన ఆకర్షణ అంటున్నారు గుణశేఖర్‌. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'రుద్రమదేవి'. అల్లు అర్జున్‌, అనుష్క, రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'రుద్రమదేవి'లో గోనగన్నారెడ్డి తొలి రూపు (ఫస్ట్‌లుక్‌)ను చిత్రబృందం విడుదల చేసింది. గుణశేఖర్‌ మాట్లాడుతూ ''యువత, మాస్‌ను ఆకట్టుకొనే పాత్రలో బన్నీ కనిపిస్తాడు. గోనగన్నారెడ్డిగా ఆయన పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుంది.

  45 రోజుల పాటు బన్నీపై సన్నివేశాలు తెరకెక్కించాం. పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వంలో రూపొందించిన పోరాట సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయ''న్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, కృష్ణంరాజు, నిత్యమీనన్‌, కేథరిన్‌, ఆదిత్యమీనన్‌, అజయ్‌, జయప్రకాష్‌రెడ్డి తదితరులు నటించారు. కళ: తోట తరణి, ఛాయాగ్రహణం: అజయ్‌ విన్సెంట్‌, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌, సమర్పణ: రాగిణీ గుణ

  కాకతీయుల చరిత్రలో గోన గన్నారెడ్డి పాత్రకు ప్రముఖ స్థానముంది. ప్రజల సంక్షేమం కోసం పోరాడిన ఓ వ్యక్తి పాత్ర అది. ఈ పాత్రకు ఎవరు సరితూగుతారా అని ఆలోచిస్తుండగా అల్లు అర్జున్‌ గుర్తొచ్చాడు. పాత్రకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్న హీరో అతను. ఈ కథ గురించి చెప్పగానే అతడు కూడా వెంటనే అంగీకరించాడు. దీంతో నేటి తరం హీరోలలో ఇలాంటి పాత్రలు పోషించడానికి నాంది పలికినవాడిగా బన్నీ నిలుస్తాడు.

  ఎన్టీఆర్‌కు 'పల్నాటి బ్రహ్మనాయుడు'లా, ఏఎన్నార్‌కు 'తెనాలి రామకృష్ణుడు'లా, కృష్ణంరాజుకు 'తాండ్రపాపారాయుడు'లా, కృష్ణకు 'అల్లూరి సీతారామరాజు'లా బన్నీకి మా 'రుద్రమదేవి' సినిమా నిలిచిపోతుంది. ఇప్పటికే బన్నీ గుర్రపుస్వారీ, కత్తిసాములో శిక్షణ పొందుతున్నాడు. అతడి సరసన అనామిక దేవిగా కేథరిన్‌ నటిస్తుంది'' అంటూ గుణశేఖర్ చెప్తున్నారు.

  English summary
  Arjun wrote on his Facebook page, "Prabhas' look in Bahubali looks terrific. Advance birthday wishes to my dearest darling Prabhas."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X