»   » భారత జవానుగా అల్లు అర్జున్.. హిట్టుపై హిట్టుకు స్టైలిష్ స్టార్ దూకుడు!

భారత జవానుగా అల్లు అర్జున్.. హిట్టుపై హిట్టుకు స్టైలిష్ స్టార్ దూకుడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

దువ్వాడ జగన్నాథం చిత్రం తర్వాత తదుపరి చిత్రాన్ని వేగంగా ప్రారంభించేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సిద్ధమవుతున్నారు. సినీ కథా రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారి రూపొందిస్తున్న చిత్రంలో అల్లు అర్జున్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారనే విషయం ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రచారమవుతున్నది. ఈ చిత్రానికి నా పేరు శివ. నా ఇల్లు ఇండియా అనే పేరు ఖారారు చేసినట్టు సమాచారం.

దర్శకుడిగా వక్కంతం వంశీ

దర్శకుడిగా వక్కంతం వంశీ

దువ్వాడ జగన్నాథం చిత్రం షూటింగ్‌లో ఉండగానే వక్కంతం వంశీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు స్టైలిష్ స్టార్. అతిథి, కిక్, టెంపర్, కిక్2 లాంటి చిత్రాలకు వంశీ కథలను అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నా పేరు శివ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ చిత్రంలో తమిళ నటుడు అర్జున్ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. కన్నడ నటి రష్మిక మండన్నా హీరోయిన్‌గా ఎంపికైంది.

సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి

సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి

జాతీయ అవార్డు గ్రహీత, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి కెమెరామెన్ బాధ్యతలను చేపట్టనున్నారు. లగడపాటి శ్రీధర్ నిర్మాతగా వహిస్తున్న చిత్రానికి విశాల్, శేఖర్ సంగీతం అందిస్తారు. నా పేరు శివ జూన్‌లో పట్టాలు ఎక్కనున్నట్టు సమాచారం.

మే 19న డీజే రిలీజ్

మే 19న డీజే రిలీజ్

సరైనోడు చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకొన్న అల్లు అర్జున్ దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో దువ్వాడ జగన్నాథం చిత్రంలో నటించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పొస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ చిత్రం మే 19న విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథా నాయిక.

లింగుస్వామి కథకు గ్రీన్ సిగ్నల్

లింగుస్వామి కథకు గ్రీన్ సిగ్నల్

నా పేరు శివకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లు అర్జున్ ఆ తర్వాత చిత్రంపై కూడా క్లారిటీతో ఉన్నాడు. తమిళ దర్శకుడు లింగుస్వామి చెప్పిన కథకు ఓకే చెప్పాడు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో రూపొందించేందుకు ప్లాన్ చేశారు.

English summary
Tollywood superstar Allu Arjun will be playing a soldier in his forthcoming film Naa Peru Surya Naa Illu India. Allu Arjun will be playing a soldier in Naa Peru Surya Naa Illu India, which will be helmed by Vakkantham Vamsi. National Award-winning cinematographer Rajeev Ravi will crank the camera and music composer duo Vishal-Shekhar will be scoring the film. Naa Peru Surya is likely to go on the floors in June.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu