»   » అనుష్క ‘రుద్రమదేవి’లో గెస్ట్ పాత్రలో అల్లు అర్జున్ ఖరారు

అనుష్క ‘రుద్రమదేవి’లో గెస్ట్ పాత్రలో అల్లు అర్జున్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తాజాగా ఒక వార్త చర్చనీయాంశం అయింది. అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రుద్రమదేవి' చిత్రంలో అల్లు అర్జున్ ఒక ముఖ్యమైన గెస్ట్ రోల్ చేయడానికి ఓకే చెప్పారు. గోనగన్నారెడ్డి అనే అల్లు అర్జన్ ఎంపికైనట్లు దర్శకుడు గుణశేఖర్ స్వయంగా వెల్లడించినట్లు సమాచారం.

ఇంతకు ముందు ఈ పాత్ర మహేష్ బాబుతో చేయించడానికి ప్రయత్నించిన గుణశేఖర్...ఫెయిల్ అయ్యారని, ఆ తర్వాత రవితేజతో చేయించాలని ట్రై చేసినా ఫలితం లేక పోయిందనే వార్తలు వినిపించాయి. సాధారణ నటులతో ఆ పాత్ర చేయిస్తే పెద్దగా ఫలితం ఉండదని భావించిన గుణశేఖర్ ఇంతకాలం ఎవరైనా స్టార్ హీరోను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరిపారు. ఎట్టకేలకు అల్లు అర్జున్‌ను ఒప్పించాడు.

కాకతీయ వీరవనిత రాణి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా చారిత్రక నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క టైటిల్ రోల్ పోషిస్తోంది. దర్శకుడు గుణశేఖర్ తన సినీ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

రుద్రమదేవి

రుద్రమదేవి


గుణా టీం వర్క్ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో గుణశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భారతదేశపు తొలి హిస్టారికల్ స్టిరియోస్కోపిక్ 3డి చిత్రంగా రాబోతోంది. ఈ చిత్రంలో రాణీ రుద్రమగా అనుష్క నటిస్తోంది.

రానా

రానా


చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్ తదితరులు నటిస్తున్నారు.

ఇతర పాత్రలు

ఇతర పాత్రలు


ఇతర పాత్రలు మురారిదేవునిగా ఆదిత్యమీనన్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, కోటారెడ్డిగా ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా అజయ్ కనిపించనున్నారు.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం


తెర వెనక ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.

English summary
Director Gunasekhar is searing for the role of Gona Gannareddy for Rudramadevi movie. He tried Mahesh Babu and NTR, but no one turned out. At last his search came to end. Allu Arjuna has accepted to reprise the role of Gona Ganna Reddy in his prestigious project ‘Rudrama Devi’ .As per reliable sources, Allu Arjun will be playing this powerful and pivotal role in the historic film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu