»   » ‘ఇద్దరమ్మాయిలతో’ మూవీ టాకేంటి?

‘ఇద్దరమ్మాయిలతో’ మూవీ టాకేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్‌కు తగిన విధంగా ఈ చిత్రాన్ని స్టైలిష్‌గా రూపొందినట్లు ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, వాల్ పేపర్లు, టీజర్లో స్పష్టమైన సంగతి తెలిసిందే.

తాజాగా సినిమా చూస్తే కూడా అదే విషయం స్పష్టమవుతుంది. ఈ చిత్రాన్ని బన్నీ-పూరి కాంబినేషన్లో వచ్చిన మంచి స్టైలిష్ ఎంటర్టెనర్‌గా చెప్పుకోవచ్చు. బన్నీ ఈ చిత్రంలో చాలా స్టైలిష్ గా కనపడటంతో పాటు పెర్ఫార్మెన్స్ పరంగా కూడా అదరగొట్టాడు. ముఖ్యంగా అతని డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఇక డాన్సులు ఇరగ దీసాడనే చెప్పాలి. గ్యాంగ్ లీడర్ సినిమాలోని 'పాప రీట' సాంగుకు చిరంజీవి మాదిరి స్టెప్పులేసి దుమ్ము రేపాడు. కేచ కంపోజ్ చేసిన యాక్షన్స్ సీన్స్ హైలెట్ గా ఉన్నాయి.

హీరోయిన్లలో కేథరిన్ గ్లామరస్‌గా, చాలా అందంగా కనిపించింది. ఆమె నటన కూడా బాగుంది. అమలపాల్ తెలుగు సంప్రదాయ దుస్తువుల్లో అచ్చతెలుగు అమ్మాయిలా ఆకట్టుకుంది. సాంగులను కూడా చాలా బాగా తెరకెక్కించారు పూరి. ఫిడేల్ బ్రహ్మాగా బ్రహ్మానందం, సైకో కృష్ణగా అలీలు కామెడీ పండించారు.

అయితే గతంలో పూరి సినిమాలు చూసి ఆ తరహా అంచనాలతో వెళితే....మీ అంచనాలు తప్పుతాయి. ఈ సినిమా పూరి గత సినిమాలకు భిన్నంగా ఉంది. పూరి మార్కు పంచ్ డైలాగులు వినపడవు. గత సినిమాల్లో ఆయన హీరోను ప్రజెంట్ చేసిన తీరుతో పోలిస్తే ఇందులో భిన్నంగా ఉంది. మరి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేదానిపైనే రిజల్ట్ ఆధార పడింది.

English summary

 Iddarammayilatho, starring Allu Arjun, Amala Paul and Catherine in the lead roles and directed by Puri Jagannath, is released worldwide today. The movie gets pasitive talk.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu