»   » ఫ్యామిలీలకు పట్టే స్పూర్తి ('సన్నాఫ్‌ సత్యమూర్తి' ప్రివ్యూ)

ఫ్యామిలీలకు పట్టే స్పూర్తి ('సన్నాఫ్‌ సత్యమూర్తి' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్ సినిమా అంటేనే అంచనాలు పెరిగిపోతాయి. అలాంటిది కుటుంబ ప్రేక్షకులను తనదైన సెంటిమెంట్, భావోద్వేగాలు, ఫన్ తో ఆకట్టుకునే త్రివిక్రమ్ జత కలిస్తే ఇంకేముంది. జులాయి ని మించిపోతుంది. ఇప్పుడు అందరి అంచనా ఇదే. దానికి తోడు విభిన్నమైన టైటిల్, అత్తారింటికి దారేది వంటి మెగా హిట్ తర్వాత త్రివిక్రమ్ నుంచి, రేసు గుర్రం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ వస్తున్న చిత్రం కావటం మరింతగా అంచనాలు పెంచేసింది. ఇప్పటికే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఈ రోజు భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


విలువైన మంచిమాటలే ఆస్తి అనే అంశాన్ని ఈ చిత్రంలో ప్రధానమైన అంశంగా తీసుకుని దర్శకుడు కథను రూపొందించారు. 'నాన్న నాకేమిచ్చాడు' అంటూ లెక్కలేసుకొంటుంటారు తనయులు. కార్లు, బంగళాలూ, వూరవతల గెస్ట్‌ హౌస్‌లూ ఇవన్నీ కాగితాలపైనే కనిపిస్తాయి. కానీ కంటికి కనిపించని ఆస్తులు ఆయన చాలానే ఇస్తాడు. బతుకు పోరాటం నేర్పించేది నాన్నే. అంతెందుకు ఈ జీవితాన్ని ఇచ్చిందే నాన్న. విరాజ్‌ ఆనంద్‌ నమ్మిందీ అదే. సత్యమూర్తి గారబ్బాయి విరాజ్‌ ఆనంద్‌. తండ్రంటే దస్తావేజులపై కనిపించే సంతకం కాదు.. నా జీవితం అని నమ్మిన విరాజ్‌.. ఆ తండ్రి కోసం ఏం చేశాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


Allu Arjun's Son Of Satyamurthy preview

చిత్రం గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఇటీవల వచ్చిన 'ఇద్దరమ్మాయిలతో...' సినిమాలో రాక్ గిటార్ ప్లేయర్‌గా చేశాను. 'రేసు గుర్రం'లో మధ్యతరగతి అబ్బాయిగా చేశాను. వాటితో పోలిస్తే, 'సన్ ఆఫ్ సత్యమూర్తి'లో నాది కొంత డిగ్నిటీ ఎక్కువున్న పాత్ర. హుందాతనం నిండిన ఆ పాత్రలో కూడా వస్త్రధారణలో ఒక స్టైల్ తెచ్చేందుకు ప్రయత్నించాం. పైగా, నేనెప్పుడూ ఒకటికి నాలుగు అలంకరణలతో నిండిన వస్త్రధారణ చేస్తుంటా. కానీ, పాటలు వదిలేస్తే, ఈ సినిమాలో కావాలనే అవన్నీ వదిలించుకొని, సింపుల్‌గా, సింగిల్ పీస్‌లో ఉండేలా చూశా. దాంతో, నేను కొత్తగా కనిపిస్తాను అన్నారు.


ఇక త్రివిక్రమ్ తో సినిమా అంటే చాలు నేను ఒప్పేసుకుంటా. ఆ తరువాతే స్క్రిప్టు వింటా. మా కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'జులాయి' సమయంలోనే ఆ మాట చెప్పా. దానికే, ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. సెట్స్‌లో ఆయన ఎక్కువగా ఏదీ చెప్పరు. కాకపోతే, షూటింగ్‌కు వెళ్ళడానికి ముందే కథ, పాత్రల గురించి మాట్లాడతారు. ఆ పాత్రను అలా చేయాలి, ఇలా చేయాలని బాగా మాట్లాడుకుంటాం. సెట్స్ మీద పైకి కనపడని హోమ్ వర్క్ ఆయనది. ప్రపంచ సినిమా మీద ఆయనకున్న జ్ఞానం అపారం.


'జులాయి'తో పోలిస్తే, ఇప్పుడు నేను, ఆయన ఎదిగాం. మునుపటి కన్నా ఆయనలో వేగం, పరిణతీ పెరిగాయి. దర్శకత్వంలో అది స్పష్టంగా అర్థమైంది. అతను మనతో సినిమా తీస్తున్నది డబ్బు కోసమా, ఖాళీ లేకుండా చూసుకోవడానికా, మరో దానికా అన్నది చూస్తాను. సరైన మైండ్‌సెట్‌తో వస్తే ఓ.కె.చెప్పేస్తా. నిజం చెప్పాలంటే, దర్శకులు రెండు రకాలు. మన నుంచి రాబట్టుకొనేవారు ఒక రకం. మనకు ఎంతో ఇన్‌పుట్స్ ఇచ్చేవారు రెండో రకం. త్రివిక్రమ్ రెండో రకం దర్శకుడు. 'జులాయి'కి ఆయన ఇచ్చిన ఇన్‌పుట్స్ ఎంతో ఉపయోగపడ్డాయి. అప్పటి నుంచి నటుడిగా క్రమంగా ఒక్కో పొరనూ చీల్చుకుంటూ, బాగా బయటకు వస్తున్నా అన్నారు.


Allu Arjun's Son Of Satyamurthy preview

ఇక అత్తారింటిది దారేది 2 అంటూ సన్నాఫ్ సత్యమూర్తిపై వస్తున్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా అల్లు అర్జున్ కొట్టి పారేసారు. ఆయన మాట్లాడుతూ... ఇంటర్నెట్ లో ఏవేవో రాస్తూంటారు. దానికీ, దీనికి పోలికే లేదు. అత్తారింటికి లానే ఇదీ సకుటుంబ వినోద చిత్రం కావటంతో పోలిక తెస్తున్నారు. మంచి కథ కుదిరింది చేసాం అంతే అన్నారు బన్నీ.


చిత్ర నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ మాట్లాడుతూ ''ఇంటిల్లిపాదీ చూసేలా ఈ చిత్రాన్ని మలిచారు త్రివిక్రమ్‌. బన్నీ స్త్టెల్‌, నటన అందరికీ నచ్చుతాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం శ్రోతలను అలరిస్తోంది''అన్నారు.


బ్యానర్: హారికా అండ్ హాసిని క్రియేషన్స్
నటీనటులు: అల్లు అర్జున్‌,సమంత, నిత్య మేనన్‌, ఆదా శర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, సింధు తులాని, వెన్నెల కిశోర్, రావు రమేష్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ తదితరులు
కెమెరా:ప్రసాద్ మూరెళ్ల,
సంగీతం:దేవిశ్రీ ప్రసాద్,
ఆర్ట్:రవీందర్,
నిర్మాత:రాధాకృష్ణ.ఎస్.,
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:త్రివిక్రమ్.
విడుదల తేదీ: ఏప్రిల్‌ 9,2015.

English summary
Allu Arjun is having the biggest release of his career yet again as the Trivikram directorial "S/o Satyamurthy" is hitting cinemas today. Starring Allu Arjun, Nitya Menon, Samantha Ruth Prabhu and Adah Sharma in the lead roles, S/O Satyamurthy is the second time Arjun and Trivikram have collaborated after Julayi.
Please Wait while comments are loading...