»   » కంగ్రాట్స్: అల్లు అర్జున్ మళ్లీ తండ్రి అయ్యారు, ఈ సారి మాత్రం

కంగ్రాట్స్: అల్లు అర్జున్ మళ్లీ తండ్రి అయ్యారు, ఈ సారి మాత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్‌ సోషల్‌మీడియా ద్వారా తన అభిమానులకు తెలియచేసారు.

ఇదివరకే వారికి అయాన్‌ అనే బాబు ఉండగా ఇప్పుడు పాపపుట్టడంతో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. చాలా ఆనందంగా ఉందని.. ఇంతకు మించి ఏమీ కోరుకోవడం లేదని ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఖాతాల్లో పోస్ట్‌ చేశాడు. ఈ సందర్బంగా స్నేహితులు, బంధువులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియచేసారు.

స్నేహితుల నుంచి ప్రేమికులుగా మారిన అల్లు అర్జున్, స్నేహ తమ పెద్దలను ఒప్పించి ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. 2014లో ఈ దంపతులకు కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. బుజ్జిగాడికి ముద్దుగా 'అయాన్' అని పేరు పెట్టుకున్నారు. అయాన్ అల్లరి చేష్టలను అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు.

Allu Arjun, Sneha Blessed with Baby Girl

అల్లు అర్జున్ కెరీర్ విషయానికి వస్తే...వరుస విజయాలతో దూసుకుపోతోన్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా, మాస్ కథలను జనరంజకంగా తీసి బ్లాక్బస్టర్ హిట్స్ సాధించిన హరీష్ శంకర్ దర్శకత్వం లో, భారీ కుటుంబ కథా చిత్రాలను నిర్మించే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు డిజే టైటిల్ తో ఓ చిత్రం మొదలై రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఏడు సంవత్సరాల తరువాత అల్లు అర్జున్ - దిల్ రాజు కంబినేషన్ లో వస్తోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. హరీష్ శంకర్ - దేవీ శ్రీ ప్రసాద్ కంబినేషన్ కూడా 4 సంవత్సరాల తరువాత కుదరటం తో, ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడనున్నది.

అటు అల్లు అర్జున్ కి, ఇటు హరీష్ శంకర్ కి శ్రీ వెంకటేశ్వర క్రెయేషన్స్ బ్యానర్ లో ఇది మూడవ చిత్రం కావటం విశేషం. భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ఈ చిత్రాన్ని 2017 వేసవి సెలవుల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజు తెలిపారు.

English summary
"Blessed with a Baby Girl ! Soooo Happppyyyyyy right now ! One boy & one girl. Could'nt ask for more. Thank you for all the wishes. Lucky me," Allu Arjun posted on his micro-blogging page.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu