»   » ఆ విషాదాన్ని తలుచుకుని ... డిజే ఆడియో వేడుకలో అల్లు అర్జున్ ఎమోషన్!

ఆ విషాదాన్ని తలుచుకుని ... డిజే ఆడియో వేడుకలో అల్లు అర్జున్ ఎమోషన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరో, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన డిజె-దువ్వాడ జగన్నాథమ్ మూవీ ఆడియో రిలీజ్ వేడుక ఆదివారం శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది. విదేశీ టూర్లో ఉండటం వల్ల ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ హాజరు కాలేకపోయారు.

కాగా... అభిమానుల కోలాహలం మధ్య ఆడియో వేడుక గ్రాండ్ గా జరిగింది. అల్లు అర్జున్ కుమారుడు అయాన్ చేతుల మీదుగా ఆడియో సీడీలను ఆవిష్కరించారు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ... డిజే షూటింగ్ సమయంలో జరిగిన ఓ విషాదాన్ని తలుచుకుని కాస్త ఎమోషన్ అయ్యారు.


దిల్ రాజు నేను ఒకేసారి

దిల్ రాజు నేను ఒకేసారి

దిల్ రాజుగారు, నేను ఒకేసారి లైఫ్ స్టార్ట్ చేశాం. ఆయన బ్యానర్లో ఆర్య నా సెకండ్ సినిమా. ఇవాళ నేను ఆయన బేనర్లో 25వ సినిమా చేస్తున్నాను. అనుకోకుండా నా రెండో సినిమా ఆర్య, ఆయన రెండో సినిమా కూడా అదే. నా ఆరో సినిమా పరుగు... ఆయన ఆరో సినిమా కూడా పరుగు. మేమిద్దరం కలిసి రెండు సక్సెస్ ఫుల్ సినిమాలు చేశాం. ఈ సారి కూడా థర్డ్ ఫిల్మ్ హాట్రిక్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని బన్నీ అన్నారు.


నా హోమ్ బేనర్

నా హోమ్ బేనర్

మా నాన్నగారి గీతా ఆర్ట్స్ తర్వాత అంత హోమ్ గా ఫీలయ్య బేనర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఎంతో మంది కొత్త డైరెక్టర్లను ఇంట్రడ్యూస్ చేసిన బేనర్. ఎన్నో గొప్ప సినిమాలను ఇచ్చిన బేనర్ అంటూ దిల్ రాజు బేనర్ మీద అల్లు అర్జున్ పొగడ్తలు గుప్పించారు.


దిల్ రాజు కోసం ఆడాలని ఎమోషన్ అయిన బన్నీ

దిల్ రాజు కోసం ఆడాలని ఎమోషన్ అయిన బన్నీ

ముందు అందరికంటే ఎక్కువగా ఈ సినిమా నా కోసం ఆడాలనుకున్నాను. కానీ ఒక రోజు నా నిర్ణయ మారింది. ఈ సినిమా ఎవరి కోసం ఆడాలంటే కేవలం దిల్ రాజు గారి కోసం ఆడాలని కోరుకున్నాను. ఎందుకంటే షూటింగ్ సగం అయ్యాక అనుకోకుండా వాళ్ల భార్య అనితా ఆంటీ మనల్ని వదిలేసి వెళ్లిపోయారు... అంటూ అల్లు అర్జున్ ఎమోషన్ అయ్యారు.


సంతోషంగా ఉన్నట్లు నటించారు

సంతోషంగా ఉన్నట్లు నటించారు

మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఆవిడ లేరు, దిల్ రాజుగారు ఎలా ఉంటారో? షూటింగ్ ఎలా జరుగుతుందో? అనే థాట్ కూడా రాక ముందే ఆయనే అంత బాధలో కూడా 11 రోజు అయిపోయిన తర్వాత మాతో పాటు వచ్చి షూటింగులో కూర్చుని సరదాగా ఉంటూ, అట్లీస్ట్ ఆ టైమ్ కన్నా సరదాగా ఉన్నట్లు నటిస్తూ ఎలాంటి ఆటంకం రాకుండా ఈ సినిమా పూర్తి చేశారు. ఈ సినిమా మా అందరి కంటే దిల్ రాజుగారి కోసం ఆడాలి అని అల్లు అర్జున్ అన్నారు.


హరీష్ శంకర్ గురించి

హరీష్ శంకర్ గురించి

డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాలన్నీ చూశాను. ఆయన అన్ని సినిమాల్లో పంచ్ డైలాగులు, ఎంటర్టెన్మెంట్ బావుంటుంది. ఎంత ఎంటర్టెన్మెంట్ రాయగలరో, ఎమెషన్ కూడా అంతే ఉంటుంది. ఆయనతో సినిమా చేస్తే ఇలా రెండు ఉండే సినిమా చేయాలనుకున్నాను. లక్కీగా డిజెతో అలాంటి సినిమానే కుదిరింది. దువ్వాడ జగన్నాథమ్ లో ఎంటర్టెన్మెంట్ ఉంటుంది. డిజెలో పంచ్ ఉంటుంది. హరీష్ శంకర్ గారిలో అంత డెప్త్ ఉండి కూడా చాలా సరదాగా ఉంటారు అన్నారు.


దాసరికి నివాళి

దాసరికి నివాళి

డిజే ఆడియో వేడుకలో దాసరి నారాయణ రావుకు అల్లు అర్జున్ నివాళులు అర్పించారు. దాసరిగారు వెళ్లి పోయి 11 రోజులు అవుతుంది. ఆయన ఎప్పటికీ తెలుగు పరిశ్రమలో గుర్తుండి పోతారు అన్నారు అల్లు అర్జున్.


మెగా అభిమానుల గురించి

మెగా అభిమానుల గురించి

మెగా అభిమానులు అంటే కేవలం మెగాస్టార్ అభిమానులే కాదు. మెగా అభిమానులు అంటే మెగాస్టార్ గారు, పవర్ స్టార్ గారు, రామ్ చరణ్, తేజు, శిరీష్, వరుణ్, నిహారిక అందరు అభిమానులను టోటాలిటీలో ఎలా పిలవాలో తెలియకు మెగా అభిమానులు అంటాము. మీలో మీరు ఎవరినైనా ఇష్టపడొచ్చు. అందరూ కలిసి ఉండాలి. మనమంతా మెగా ఫ్యామిలీ అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.


 దేవి శ్రీ ప్రసాద్ గురించి

దేవి శ్రీ ప్రసాద్ గురించి

పబ్బుల్లో వాయించే పాటలు కావాలి, పగిలిపోయేలా వాయించే పాటలు కావాలి అని దేవిశ్రీ ప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నాం. దేవి థాంక్యూ సోమచ్. ప్రతి పాటతో ఆడియన్స్ మనసులకు మమ్మల్ని మరింత దగ్గరగా తీసుకెలుతున్నావ్. సభా ముఖంగా నీకు మరోసారి ధన్యవాదాలు. అందరూ అనుకోవచ్చు మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ఆడియో విడుదల చేసి సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అని. మనం చేసే పనిలో మనసు కనిపిస్తే చాలు మనిషి కనిపించక పోయినా ఫర్వాలేదనే రకం దేవిశ్రీ ప్రసాద్... అని అల్లు అర్జున్ తెలిపారు.


హీరోయిన్ గురించి..

హీరోయిన్ గురించి..

ఏ అమ్మాయిలో అయినా నవ్వు, డిగ్నిటీ కోరుకుంటాను. ఈ రెండు పూజా హెగ్డేలో ఉన్నాయి. వెరీ సిన్సియర్, వెరీ హార్డ్ వర్కింగ్, స్వీట్.. సినిమా అవన్నీ పక్కన పెడితే కుర్రాళ్లు పూజను చూస్తే వాళ్ల మనసు లవ: లవ్వస్య లవ్యోభ్య: అంటుంది అంటూ చమత్కరించాడు అల్లు అర్జున్.English summary
Allu Arjun speech at DJ - Duvvada Jagannadham Audio Launch. DJ Movie Starring AlluArjun, PoojaHegde. Directed by Harish Shankar & Produced by Dil Raju under the Banner Of Sri Venkateshwara Creations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu