twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ 'రేసు గుర్రం' కొత్త పోస్టర్స్ (ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రేసుగుర్రం'. ఈ చిత్రంలోని పాటలు ఈ రోజు విడుదల అవుతున్నాయి. మొదట ఈ నెల 14న విడుదల చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే అదే రోజు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ మీటింగ్ ఉండటంతో దాన్ని ఈ రోజు అంటే మార్చి 16కి వాయిదా వేసారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ వేడక జరగనుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్స్ ని విడుదల చేసారు.

    సురేంద్రరెడ్డి మాట్లాడుతూ..."గెలుపు కోసం బరిలో దిగినవాడికి... లక్ష్యం మాత్రమే కనిపించాలి. ఎదురొస్తున్న సవాళ్లు, పరిగెట్టిస్తున్న పరిస్థితులు, చుట్టుముడుతున్న సమస్యలూ ఇవేమీ పట్టించుకోకూడదు. రేసులో నిలవాలన్నా, నిలిచి గెలవాలన్నా పోరాడాల్సిందే. ఆ యువకుడూ అదే చేశాడు. 'రేసు గుర్రం'లా దూసుకుపోయాడు. మరి విజయం అందిందా? లేదా? ఇంతకీ ఈ రేసు దేని కోసం? తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే!" అన్నారు

    నిర్మాతలు మాట్లాడుతూ "బన్ని కెరీర్‌లో ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. ఆద్యంతం నవ్వులు పండిస్తూనే ఉంటుంది. మా రేసుగుర్రం విశేషాలు ఇంకా తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. వినోదం, యాక్షన్‌ మేళవించిన కథ ఇది. టైటిల్‌కి తగ్గట్టే.. హుషారుగా సాగిపోతుంది'' అని అన్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

    స్లైడ్ షో లో...పోస్టర్స్ తో విశేషాలు..

    లేట్ అయ్యింది...

    లేట్ అయ్యింది...

    అల్లు అర్జున్‌, కిక్‌ దర్శకుడు సురేందర్‌ రెడ్డి కాంబినేషన్లో రూపొందుతున్న ‘రేసు గుర్రం' గత సంవత్సరం అక్టోబర్లోనే ఈ చిత్రం అఫీషియల్‌గా ప్రారంభోత్సవం జరుపుకుంది. అయితే డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవటం, స్క్రిప్టు పక్కాగా పూర్తి చేయటం కూడా లేటు చేసారు. ఇప్పుడు రెగ్యులర్ గా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది.

    టైటిల్ జస్టిఫికేషన్ ...

    టైటిల్ జస్టిఫికేషన్ ...

    ఒక్కసారి రేసు గుర్రం పరిగెట్టడం మొదలుపెట్టిందంటే విజయం సాధించేదాకా పరిగెడుతూనే ఉంటుంది. అటువంటి వేగంగా పరిగెత్తే గుర్రాన్ని చూస్తే ఎవరికైనా దాన్న ఎక్కి అందరికన్నా ముందు అనుకున్న చోటికి చేరాలని వుం టుంది. ఇదే అంశాన్ని దర్శకుడు సురేందర్‌రెడ్డి తన చిత్రంలో చూపబోతున్నారు అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

    మరింత స్టైలిష్ గా...

    మరింత స్టైలిష్ గా...

    బన్నీ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయేలా ఈ చిత్రం నిర్మించనున్నారని సమాచారం. బన్నీ ఈ చిత్రంలో సరికొత్త స్టయిల్లో కనిపించనున్నారని, అతని గెటప్ అంతా మార్చివేసి నిర్మిస్తున్నారని వినికిడి. స్టైలిష్ దర్శకుడు, స్టైలిష్ హీరో కావటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

    లవ్ స్టోరీ విత్ యాక్షన్

    లవ్ స్టోరీ విత్ యాక్షన్

    దర్శకుడు సురేంద్ర రెడ్డి గత చిత్రాల తరహాలో ఈ సినిమా ట్విస్ట్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని తెలుస్తోంది. అల్లు అర్జున్ సైతం ప్రత్యేక శ్రద్ద పెట్టి ఈ చిత్రం తో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పూర్తి దృష్టి పెట్టి చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు చెప్తున్నాయి.

    కాన్సెప్టు...

    కాన్సెప్టు...

    "పరుగు పందెంలో గెలవడం రేసుగుర్రం విధి. జీవితమనే పరుగు పందెంలో గెలవడం మనిషి విధి. అయితే... ఈ రేసులో అడపాదడపా గెలిచేవారు కొందరైతే... గెలుపుని ఇంటిపేరుగా మార్చుకున్నవాళ్లు కొందరు. ఆ కొందరిలో ఒకడి కథే... ‘రేసుగుర్రం. బాధ్యతాయుతమైన ఓ యువకుని కథాంశంతో సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు"

    కసితో చేస్తున్న చిత్రం...

    కసితో చేస్తున్న చిత్రం...

    కిక్‌ సినిమాతో హిట్ కొట్టి స్టార్ దర్శకుడిగా మారిన సురేందర్ రెడ్డి, ఆ తర్వాత ఊసరవెల్లితో బోల్తా పడ్డాడు. అయితే ఈచిత్రంతో ఎలాగైనా హిట్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది.

    కథ ఏమిటి..

    కథ ఏమిటి..

    సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ తిరిగే అల్లు అర్జున్ కి ఓ అన్నయ్య ఉంటాడు. అతను ఓ టప్ పోలీస్ ఆఫీసర్..కిక్ శ్యామ్. ఇద్దరికి ఎప్పుడూ పడదు..ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటారు. ఈ లోగా..శ్యామ్... ఓ అవినీతి మినిస్టర్ కి చెందిన ఇల్లీగల్ ఏక్టివిటీస్ పట్టుకుని అరెస్టు చేయటానికి రెడీ అవుతాడు. అయితే అతన్ని పట్టిచ్చే డాక్యుమెంట్స్ మిస్ అవుతాయి. వాటి మీద తన తమ్ముడు అల్లు అర్జున్ ఫింగర్ ఫ్రింట్స్ ఉంటాయి. దాంతో తన తమ్ముడునే దోషిగా నిర్దారించి అరెస్ట్ చేయటానికి సిద్దపడతాడు. అలాంటి పరిస్ధితుల్లో అల్లు అర్జున్...తన నిర్ధోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు...తనని కేసులో ఇరికించిన విలన్స్ కి ఎలా బుద్ది చెప్పాడనేది మిగతా కథ. ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు పూర్తి స్ధాయి కామెడీ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ కథ నిజమే అయితే మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చూడబోతున్నామన్నమాట.

    సలోని హ్యాపీ...

    సలోని హ్యాపీ...

    ఇందులో మరో హీరోయిన్ కు అవకాసం ఉంది. అది సలోని ని వరించింది. తన పాత్ర గురించి సలోని మాట్లాడుతూ.... ''ఈ సినిమాలో నా పాత్ర పూర్తిగా సంప్రదాయబద్ధంగా సాగుతుంది. ఎక్కువ భాగం చీరకట్టులోనే కనిపిస్తా. నటనకు అస్కారం ఉన్న పాత్ర దక్కడం నా అదృష్టం'' అని చెబుతోంది సలోని. మరి ఇలాంటి పాత్రలో ఈ 'తెలుగమ్మాయి' ఎలా ఒదిగిపోతుందో చూడాలి. హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న 'తెలుగమ్మాయి' నిరాశపరిచింది. వెంకటేష్‌ సినిమా 'బాడీగార్డ్‌'లో నటించినా ఆమె పాత్రకు తగిన గుర్తింపు రాలేదు. సలోని కెరీర్‌ ఏమైపోతుందో అనుకొంటున్న దశలో ఈ అవకాశం ఆమె ముంగిట వాలింది.

    అల్లు అర్జున్ కీ కీలకం..

    అల్లు అర్జున్ కీ కీలకం..

    ఇద్దరమ్మాయిలతో... సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందిన తరువాత బన్ని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని భావిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చిత్రం చేయనున్నాడు.

    మ్యూజిక్ పై ...

    మ్యూజిక్ పై ...

    ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్ సంగీతం అందిస్తున్నారు. తమన్ ఇచ్చిన మ్యూజిక్‌పై తన అభిప్రాయాన్ని వెలుబుచ్చాడు అల్లు అర్జున్. ఫేస్‌బుక్‌లో అల్లు అర్జున్ స్పందిస్తూ...‘రేస్ గుర్రం చిత్రం కోసం తమన్ ఎక్సలెంట్ సాంగ్స్ ఇచ్చాడు. సినిమా ఆడియో విడుదల ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. పాటలు సూపర్ హిట్టవడం ఖాయం' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

    కొత్త విలన్...

    కొత్త విలన్...

    ఈ చిత్రంలో విలన్ గా...భోజపురి హీరో రవి కిషన్ చేస్తున్నారు. రవికిషన్ ఈ చిత్రంలో శివారెడ్డి అనే పాత్రను పోషిస్తున్నారు. అతని పాత్ర ఓ రాజకీయనాయకుడుది అని తెలిస్తోంది. ఈ మేరకు రవికిషన్, అల్లు అర్జున్ పై సన్నివేసాలను అన్నపూర్ణా స్టూడియోలో నిన్న షూట్ చేసారు. ఈ చిత్రం విడుదల అయ్యాక తెలుగులోనూ పూర్తి బిజీ అవుతాననే నమ్మకంగా ఉన్నారు రవి కిషన్.

    తెరవెనుక...ముందు

    తెరవెనుక...ముందు

    కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

    English summary
    
 Allu Arjun starrer Racegurram will have its audio launch on March 16th in Hyderabad. Music composer S S Thaman confirms this. He is composing the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X