»   » పవన్ కు అల్లు అర్జున్ పుట్టిన రోజు విషెష్ ఇలా

పవన్ కు అల్లు అర్జున్ పుట్టిన రోజు విషెష్ ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ రోజు అంటే బుధవారం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అనే సంగతి తెలిసిందే. దాంతో ఆయన అబిమానులు, సినీ సెలబ్రెటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. తాజాగా ఆయన కుటుంబ సభ్యుడైన అల్లు అర్జున్ ట్విట్టర ద్వారా విషెష్ ని తెలిపారు. ఆయనేం ట్వీట్ చేసారో ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మరో ప్రక్క పవన్‌కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా ఆయన నటిస్తున్న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమా టీజర్‌ను చిత్ర యానిట్ విడుదల చేసింది. మంగళవారం అర్ధరాత్రి విడుదల చేసిన ఈ టీజర్‌ ఆన్‌లైన్‌లో సందడి చేస్తోంది. కాజల్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో శరత్‌మరార్‌ తెరకెక్కిస్తున్నారు. 2016 ప్రథమార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ టీజర్ మీరు ఇక్కడ చూడండి.

బుధవారం పవన్‌ కల్యాణ్‌ జన్మదినం. సంబరాలకు దూరంగా కుటుంబ సభ్యులతో గడపడానికి సెలవు తీసుకొన్నారు. ప్రస్తుతం పవన్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో నటిస్తున్నారు. చిత్రీకరణకు విరామం తీసుకొని పవన్‌ విహార యాత్రకు వెళ్లారు. మరో వారం రోజుల్లో హైదరాబాద్‌ తిరిగొచ్చి యథావిధిగా 'సర్దార్‌' షూటింగ్ లో పాల్గొంటారు.

English summary
Allu Arjun tweeted: "Birthday Wishes to Kalyan Babai ! That's what I call him !"
Please Wait while comments are loading...