»   » ఈ రోజే మొదటి రోజు.... అంటూ అల్లు అర్జు్న్

ఈ రోజే మొదటి రోజు.... అంటూ అల్లు అర్జు్న్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చేసాయి. అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం షూటింగ్ కు ఈ రోజు నుంచి హాజరు అవుతున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసారు. ఆయన తాజాగా చేసిన ట్వీట్ చూడండి.

ఇక ఈ చిత్రం గురించి చిత్ర సంగీత దర్శకుడు తమన్ ఇలా ట్వీట్ చేసారు...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Allu Arjun tweeted Boyapati Garu's movie

ఈ చిత్రానికి సంభందించిన మరిన్ని విశేషాలు..

యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో విలన్ ఎంపిక పూర్తైందని తెలుస్తోంది. ఆ పాత్రలో కనిపించేది మరెవరో కాదు...గతంలో ఒక విచిత్రం, గుండెల్లో గోదారి చిత్రాల్లో హీరోగా కనిపించిన ఆది పినిశెట్టి అని సమాచారం. అయితే ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి తెలుగులో బిజీ అవుతానని భావిస్తున్నట్లు సమాచారం.

అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరమ్మాయిలతొ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్ ని కంపోజ్ చేసిన కెచ్చా ని ఈ సినిమాకోసం తీసుకున్నట్టు సమాచారం. కెచ్చా..ధాయిలాండ్ కు చెందిన ఫైట్ మాస్టర్.

అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ఫైట్ షూటింగ్ తో ఈ నెల 19నుండి ప్రారంభించారు. ఈ సినిమా ఈ మధ్యనే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కనపడనుంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

తొలి నుంచి తనదైన శైలిలో మాస్‌ కథల్ని తెరకెక్కించడంలో ప్రత్యేకత చూపుతూ హిట్స్ కొట్టడం బోయపాటి శ్రీను శైలి ప్రత్యేకం. 'భద్ర', 'తులసి', 'సింహా' చిత్రాలతో హిట్ చిత్రాల దర్శకుడయ్యారు. గతేడాది 'లెజెండ్‌'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకొన్నారాయన. దాంతో అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు కథను సిద్ధం చేసుకొన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘అల్లు అర్జున్‌, బోయపాటి శీను కాంబినేషన్‌లో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. బోయపాటి శ్రీను చెప్పిన కథ నాకు, బన్నికి బాగా నచ్చి మా గీతా ఆర్ట్స్‌లోనే చేస్తున్నాం. పూర్తిస్థాయి హీరోయిజం ఉంటూ ప్యూర్‌ లవ్‌ స్టోరీ మిక్స్‌ అయిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తాం.

బన్నిని అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో పక్కాగా అలాంటి పాత్రతో బోయపాటి శీను కథ చెప్పారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. ఆ వివరాలను త్వరలో చెప్తాం. బన్ని కాంబినేషన్‌లో థమన్‌ చేస్తున్న రెండో సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా అవుతుంది'' అని తెలిపారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘బన్ని బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే కథను సిద్ధం చేశాను. అరవింద్‌గారు, బన్ని ఈ కథ విని వెంటనే ఓకే చేశారు. పక్కా అవుట్‌ అండ్‌ అవుట్‌ హీరోయిజం ఉన్న స్టోరీ ఇది. లవ్‌ స్టోరీ కూడా మిళితమై ఉంటుంది. కొత్త బన్ని కనిపిస్తారు. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తాను'' అని తెలిపారు.

అల్లు అర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ సంస్థలో ఓ సినిమా రూపొందనుంది.థమన్‌.ఎస్‌.ఎస్‌. ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., మాటలు: ఎం.రత్నం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బోయపాటి శీను.

English summary
Allu Arjun tweeted: " Starting Boyapati Garu's movie today ! 1 St day of shoot. Getting ready for the run !'
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu