»   » అల్లు అర్జున్ కెరీర్ లో దిబెస్ట్ క్యారెక్టర్ ‘వరుడు’

అల్లు అర్జున్ కెరీర్ లో దిబెస్ట్ క్యారెక్టర్ ‘వరుడు’

Posted By:
Subscribe to Filmibeat Telugu

గుణశేఖర్ దర్శకత్వంలో, స్టైలిష్ హీరో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'వరుడు" ఒక పాట మినహా షూటింగ్ పూర్తిచేసుకొన్నది. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ ఈ చిత్రంలో అర్జున్ సిక్స్ ప్యాక్ బాడీతో, సంప్రదాయబద్దంగా కనిపించనున్నారని, అతని కెరీర్ లోనే ది బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం రీ రికార్డింగ్ జరుపుకుంటుందని, ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయిందని అన్నారు. మార్చి మొదటి వారంలో ఆ పాటను చిత్రీకరిస్తామని, మార్చి 26న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

చిత్ర నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ 'దేశముదురు" తర్వాత అర్జున్ తో నిర్మిస్తున్న చిత్రమిది. అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకునేలా రూపొందుతోంది. ఈ చిత్రంలో తమిళ హీరో విలన్ గా ఒక అద్భుతమైన పాత్రని పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుహాసిని, నరేష్, అశిష్ విద్యార్ధి, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu