Just In
Don't Miss!
- Sports
ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అజహరుద్దీన్ కలల లిస్టు ఇదే.. ఐపీఎల్, 4 సెంచరీలు సహా!!
- News
ఇండోనేసియా భూకంపం: 42కు పెరిగిన మృతులు -వందల ఇళ్లు ధ్వంసం -చీకట్లో సులవేసి దీవి
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్కాకి
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అక్కడ అల్లు అర్జున్ ను ‘కిలాడి’ని చేసి మసి పూసి అమ్మేసుకున్నారు...
అల్లు అర్జున్ కి మలయాళ చిత్ర సీమలో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. వాళ్లంతా ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకునే లెవల్ కి బన్నీ రేంజ్ అక్కడ పెరిగిపోయింది. కేవలం డబ్బింగ్ సినిమాలతోనే మలయాళంలో మంచి మార్కెట్ సంపాదించేశాడు. దీంతో అల్లు అర్జున్ నటించిన ప్రతి సినిమానీ మలయాళంలో విడుదల చేయడం మొదలు పెట్టారు. అలానే అల్లు అర్జున్ నటించిన 'వేదం" చిత్రాన్ని మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి 'కిలాడీ" అనే టైటిల్ పెట్టి కమర్షియల్ సినిమా కింద జమ కట్టేశారు. ప్రయోగాత్మకంగా అల్లు అర్జున్ చేసిన ఈ చిత్రంతో అతనికి చేతులు కాలాయి. ఇప్పుడా చిత్రానికి మసి పూసిమారేడు కాయ చేసి మలయాళంలోకి దించేస్తున్నారు. అల్లు అర్జున్ స్టిల్స్, కిలాడీ టైటిల్ చూసి ఓ అంచనాతో వచ్చే వారికి 'వేదం" ఎలాంటి అనుభూతినిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటివే మరో రెండు, మూడు సినిమాలు ఆడాయని మమ్ముట్టి, మోహన్ లాల్ ల సినిమాలన్నీ డబ్బింగ్ చేసుకోరుగా?