»   » ఒక అమ్మాయి తప్ప, సర్‌ప్రైజ్ చేసిన అల్లు అర్జున్

ఒక అమ్మాయి తప్ప, సర్‌ప్రైజ్ చేసిన అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సందీప్‌ కిషన్‌ హీరోగా ‘ఒక అమ్మాయి తప్ప' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజసింహ తాడినాడ దర్శకుడు. అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌ పతాకంపై బోగాది అంజిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.... సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ తో కలిసి ‘ఒక అమ్మాయి తప్ప' షూటింగ్ సెట్స్ ను సందర్శించి యూనిట్ సభ్యులను సర్ ప్రైజ్ చేసారు. హీరో సందీప్ కిషన్, చోటా కె నాయుడుతో కొంత సేపు గడిపారు. సినిమాకు సంబంధించిన విషయాలపై చర్చించారు.

Allu Arjun visits Okka Ammayi Thappa film sets

‘ఒక అమ్మాయి తప్ప' సినిమా గురించి సందీ కిషన్‌ గతంలో ఓసారి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ... మాట్లాడుతూ ‘‘ఇప్పటి వరకు కథల్ని నమ్మి మాత్రమే సినిమాలు చేశాను. ఈ సినిమాకి కథతోపాటు దర్శకుడిని కూడా నమ్మి చేస్తున్నాను. తెలివిగల కాలేజ్‌ కుర్రాడి లవ్‌స్టోరీ ఇది. అతనికి ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఆసక్తికరం. నా కెరీర్‌కి కీలకమైన చిత్రమిది'' అని తెలిపారు.

దర్శకడు మాట్లాడుతూ ‘‘కొత్త తరహా లవ్‌స్టోరీతో రూపొందుతున్న చిత్రమిది. పక్కా కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కిస్తున్నాం. 45 నిమిషాల గ్రాఫిక్స్‌ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు. ‘‘సినిమా చూపిస్త మావ' చిత్రంతో పెద్ద హిట్‌ అందుకున్నాం. అదే తరహాలో ఈ సినిమా కూడా హిట్‌ కావాలని ఆశిస్తున్నాం'' అని అంజిరెడ్డి అన్నారు.

English summary
Actor Allu Arjun visited the sets of Okka Ammayi Thappa that stars Sundeep Kishan and Nithya Menen. According to a source, Allu Arjun along with Sai Dharam Tej visited the sets and spent time with the actor, director and the cameraman Chota K. Naidu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu