»   » రియల్ లైఫ్ విలన్ అల్లు అరవిందే... రానా కామెంట్

రియల్ లైఫ్ విలన్ అల్లు అరవిందే... రానా కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రియల్ లైఫ్ విలన్ అంటూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గురించి సైమా అవార్డుల వేదికపై రానా కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది. అంత పెద్ద నిర్మాత, తమ ఫ్యామిలీ చాలా దగ్గరి వాడు అయిన అల్లు అరవింద్ ను పట్టుకుని అంతమాట అనడంతో తొలుత అంతా ఆశ్చర్య పోయారు. అయితే తాను అలా ఎందుకు అనాల్సి వచ్చిందో వివరించిన తర్వాత అంతా నవ్వుకున్నారు.

బాహుబలిలో భల్లాలదేవుడిగా నటించిన రానా సైమా అవార్డుల వేడుకలో కూడా బెస్ట్ విలన్ రోల్ కేటగిరీలో అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ చేతుల మీదుగా బెస్ట్ విలన్ అవార్డును అందుకున్న రానా మాట్లాడుతూ పై కామెంట్స్ చేసారు.

rana-aravaind

'ఈ అవార్డు మీ చేతుల మీదుగా అందుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు నాకు రియల్ లైఫ్ లో విలన్' అనేసిన రానా.... చిరంజీవి వైపు తిరిగి 'మా చిన్నపుడు రామ్ చరణ్ ఎప్పుడూ మీకు భయపడలేదు. అలాగే నేను మా నాన్నకు భయపడిందీ లేదు. కానీ మేమిద్దరం అరవింద్ గారంటే వణికిపోయే వాళ్లం. చిన్న తనంలో మేము క్లాసులు, ఎగ్జామ్స్ ఎగ్గొట్టిన సందర్భాలున్నాయి. ఇలాంటి అరవింద్ గారికి వెంటనే వెంటనే తెలిసిపోయేది...ఆయన అందరికీ చెప్పేవారు. అందుకే ఆయన అపుడు మాకు విలన్ లా కనిపించేవారు' అని రానా తెలిపారు.

చిన్నపుడు మేము విలన్ గా భావించిన ఆయన చేతుల మీదుగానే నేను ఉత్తమ విలన్ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ రానా వ్యాఖ్యానించడంతో...సభలో చప్పట్లు మ్రోగడంతో పాటు నవ్వులు విరబూసాయి.

English summary
"I'm happy to receive this Best Villain award from the villain of my life", Rana said, by showing at Allu Arvind. "Because throughout childhood, i am not terrified of my pa, and Charan isn't terrified of his pa, however we have a tendency to each ar terrified of Arvind. If we have a tendency to bunk college, he makes positive that everybody is aware of regarding it", Rana added, detonating the crowd into laughs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more