»   » సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో అల్లు అర్జున్ కొడుకు! (ఫోటో)

సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో అల్లు అర్జున్ కొడుకు! (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ ముద్దుల తనయుడు అయాన్ వెండి తెర ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఓ ఫోటో ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో పవన్ కళ్యాణ్ ఓ బాబుతో ఆడుతూ కనిపించాడు. ఆ బాబు మరెవరో కాదు.... అల్లు అయానే అంటున్నారు.

‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో అయాన్ ఓ సీన్లో కనిపించబోతున్నాడని అంటున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో ఓ బాబును కాపాడే సీన్ ఉంటుందని.... ఆ సీన్లో అయాన్ నటించాడని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది. నిజా నిజాల సంగతి పక్కన పెడితే ఈ వార్త విని మెగా ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు.


కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం సర్దార్ వహిస్తున్న ఈ చిత్రాన్ని.... పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. పవనకల్యాణ్‌ సరసన కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. పవనకల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైనమెంట్‌ ప్రై.లి, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Allu Ayaan at Sardaar Gabbar Singh sets

ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి నేతృత్వంలో రూ.5 కోట్ల వ్యయంతో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ సెట్ ఒక ఏరియాలా ఉంటుందని టాక్. 20 రోజులపాటు ఇక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. తెలుగు సినిమా చరిత్రలో భాగా ఖర్చు పెట్టిన సెట్లలో ఇదీ ఒకటిగా పేర్కొంటున్నారు.


కాగా...సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం ఏప్రిల్ నెలలో వస్తోందిన ఇప్పటి వరకు అనుకున్నాం. కానీ ఈ చిత్రం విడుదల మరింత ఆలస్యం అవుతుందని అంటున్నారు. మే నెలలో సినిమా విడుదలవుతుందని అంటున్నారు.

English summary
Tollywood's gossipmongers have been abuzz with the news that in a crucial scene in Sardaar Gabbar Singh, Pawan rescues Ayaan from a danger and that the scene has been shot already.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu