»   » అల్లు శిరీష్ సెటైర్, సంపూర్ణేష్ బాబు స్ట్రాంగ్ కౌంటర్ (వీడియో)

అల్లు శిరీష్ సెటైర్, సంపూర్ణేష్ బాబు స్ట్రాంగ్ కౌంటర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సంపూర్ణేష్ బాబు, అల్లు శిరీష్ మధ్య ఓ సరదా సన్నివేశం ఈ మధ్యనే జరిగిన ఇఫా ఉత్సవాల్లో జరిగింది. ఈ సంఘటన లో అల్లు శిరీష్ ..వేసినసెటైర్ కు ..సంపూర్ణేష్ బాబు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. మధ్యలో నవదీప్ ఇంటర్ ఫియర్ అయ్యారు.

Allu Sirish fight with Sampoornesh goes Wrong at IIFA

Allu Sirish fight with Sampoornesh goes Wrong at IIFA

Posted by TollyTweets on 1 March 2016

వీడియో చూసి నవ్వుకున్నారు కదా.ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ (ఐఫా) అవార్డుల వేడుక ఇప్పటి వరకు బాలీవుడ్‌లో మాత్రమే జరిగేది. మొదట సారి సౌత్‌ ఇండియా సినిమాను కూడా రిప్రజెంట్‌ చేస్తూ ఈ వేడుక హైదరాబాద్‌లో డిసెంబర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు కేటగిరీకి హోస్ట్‌గా నిర్వహించే బాధ్యతని అల్లు శిరీష్‌ తీసుకున్నాడు. ఈ ఐఫా ఉత్సవంను ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉండేలా ప్లాన్‌ చేసి అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు శిరీష్‌ .

ఐఫా ఉత్సవంలో అల్లు శిరీష్ వ్యాఖ్యానం ఆకట్టుకుంది. సరదాగా ఆయన పేల్లిన జోకులు అలరించాయి. చూడటానికి కాస్త సీరియస్ గా కనిపించే శిరీష్, ఈ కార్యక్రమాన్ని ఎలా నడిపిస్తాడా అని అనుకున్నారు. ఆ సందేహాలను తుడిచిపెట్టేస్తూ చాలా ఫన్నీగా ఆయన ఈ కార్యక్రమాన్ని నడిపించాడు. సందర్గానికి తగినట్టుగా . తగినంతగానే మాట్లాడుతూ అందరినీ నవ్వించాడు.

"ఈవెంట్ ఆర్గనైజర్లను నేనే అడిగాను. వారు సంతోషంగా ఒప్పుకున్నారు. యాక్టర్స్ యాంకరింగ్ చేస్తే చులకనగా చూస్తారనే వాతావరణాన్ని మార్గాలి అనుకున్నాను. ఈ కార్యక్రమం నాలో కాన్ఫిడెన్స్ పెంచింది. కెమెరా ముందు నటించడం వేరు. లైవ్ ప్రోగ్రామ్ లో మాట్లాడటం వేరు. అందుకే కొంతమంది స్క్రిప్ట్ రైటర్స్ తో కలిసి రిహార్సల్స్ చేశాను. స్టార్స్ కి కాల్ చేసి వారిని ఫన్నీ క్వశ్రన్స్ అడుగుతానని ఏమీ అనుకోవద్దని చెప్పాను. వారు ఒప్పుకోవడంతోనే ఈ వేడుక ఇంత బాగా జరిగింది." అని శిరీష్ చెప్పాడు.

ఈ కార్యక్రమంలో అల్లు శిరీష్ తన మిమిక్రీ టాలెంట్ ను ప్రదర్శించాడు. తాను కొత్తగా చేసిన ఈ ప్రయత్నాన్ని చిరంజీవి, రవితేజ, హరీష్ శంకర్ లు ఫోన్ చేసి అభినందించినట్లు చెప్పాడు. చాలా విషయాల్లో బాలీవుడ్ కి మనం ఏ మాత్రం తీసిపోమనే విషయాన్ని ఐఫా ఉత్సవం నిరూపించిందని అల్లు శిరీష్ చెప్పాడు.

Allu Sirish funny Fight With Sampoornesh Babu Goes Wrong

ఈ విషయంలో తాను సక్సెస్ కాగలిగినందుకు శిరీష్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ వేడుకకి హాజరైన వాళ్లంతా అతిరథ మహారథులు. అలాంటివాళ్ల సమక్షంలో చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి వుంటుంది. వేదికపైకి వచ్చిన వాళ్లు ఎదురుగా కూరుని వీక్షిస్తున్న వాళ్లలో ఎవరి మనసు నొప్పించకుండగా మాట్లాడాలి. అలా అని ముక్తసరిగా వ్యవహరించకూడదు. అందువలన పరిధి దాటకుండానే ఆయా వ్యక్తుల స్వభావానికి తగినట్టుగా సరదాగా మాట్లాడుతూ మెప్పించానన్నాడు.

గతంలో తాను ఐఫా అవార్డ్స్ కోసం ముంబై వెళ్లినప్పుడు, సల్మాన్. షారుఖ్ షాహిద్ చేసిన స్కిట్స్ చూడటం జరిగిందనీ, ఆ విధంగా తెలుగులోను చేయాలనే తన ప్రయత్నం ఫలించిందని అన్నాడు. ఈ వేదికపై వుండి అందరినీ హాయిగా నవ్వించడం వలన తనకి మంచి టైమింగ్ ఉందనే విషయం అర్థమైందని చెప్పాడు. చిరంజీవి . వెంకటేష్ . రవితేజతో పాటు మరెంతో మంది దర్శక నిర్మాతలు మెచుకోవడం, తనకి ఎంతో ఉత్సాహాన్నీ. ప్రోత్సాహాన్ని ఇచిందని చెప్పుకొచాడు.

English summary
Allu Sirish and Sampoornesh Babu's Funny Video from IFFA.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu