»   » ఏడువందల సంవత్సరాల కథా.... ?

ఏడువందల సంవత్సరాల కథా.... ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

"గౌరవం" సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన మరో హీరో అల్లు శిరీష్. ఆ తర్వాత 'కొత్త జంట' సినిమాతో మెగా ఫ్యామిలీ హీరోల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కొత్త జంట తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న శిరీష్ తాజాగా కొత్త సినిమా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఎంవిఎన్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎస్.శైలేంద్ర బాబు, కేవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా గురించి వినిపిస్తున్న వార్తలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. ఇదొక పీరియాడికల్ మూవీ అంటున్నారు. ఏడువందల సంవత్సరాల క్రితం జరిగిన ఒక ప్రేమకథని అందంగా మలచబోతున్నారట. "సంవత్సరం నుంచి ఇటువంటి కథ కోసమే ఎదురు చూస్తున్నాడట శిరీశ్. "లవ్ ఎంటర్‌టైనర్‌గా సాగే చిత్రమిది. ఏడువందల సంవత్సరాల క్రితం జరిగిన నేపథ్యం చూపించబోతున్నాం" అని దర్శకుడు చెప్పారు.

allu sirish new move about 700 years back love story

ఏడువందల సంవత్సరాలకిందటి కథ అంటే ప్రతీ విశయం లోనూ ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. ప్రతీ ఫ్రేం లోనూ అప్పటి వతావరణాన్నీ ప్రతిబింబించాలి. నటన లోనే కాదు బాడీ లంగ్వేజ్ విషయం లోనూ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమాలో తనపాత్రకోసం శిరీష్ చాలానే కష్టపడుతున్నాడట.

అల్లు అర్జున్ సోదరుడు అయిన శిరీష్ కు తొలి చిత్రం "గౌరవం" సమయంలో మంచి క్రేజే వచ్చింది. అయితే ఆ చిత్రం డిజాస్టర్ ఫ్లాఫ్ అవటం కాస్త నిరాశ పరిచింది. ఆ తర్వాత "కొత్త జంట' సినిమాతో మెగా ఫ్యామిలీ హీరోల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నా అది శిరీశ్ కి పెద్దగా కలిసి రాలేదు. ఇప్పుడు ఈ సినిమాతో ఎలా అయినా ఒక హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు శిరీశ్..

English summary
allu sirish new movie story is about 700 years back, we can expect allu shirish in 1300 AD getup
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu