»   » పవన్ కళ్యాణ్ తో సినిమానా?.. అల్లు శిరీష్

పవన్ కళ్యాణ్ తో సినిమానా?.. అల్లు శిరీష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు శిరీష్ నిర్మాతగా పవన్ కళ్యాణ్ డ్రీమ్ ప్రాజెక్టు సత్యాగ్రహీ తెరకెక్కుతోందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయానికి స్పందిచిన అల్లు శిరీష్ ట్విట్టర్ లో...సత్యా గ్రహి..ఆ ..నేను ఆ ప్రాజెక్టుని ఎ.ఎమ్.రత్నం చేస్తారని అనుకున్నాను.కానీ అది ఆగిపోయింది. నాకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు అని తేల్చేసాడు.ఇక పవన్ కళ్యాణ్ తన చిత్రం బంగారం షూటింగ్ సమయంలో ఈ సత్యాగ్రహీ ప్రాజెక్టుని ఎనౌన్స్ చేసారు.అయితే అదీ ఇప్పటికీ రూపం దాల్చలేదు.

పవన్ కళ్యాణ్ కలల ప్రాజెక్టు సత్యాగ్రహి. తను ఎంతో ఇష్టపడి ప్రారంభించినటువంటి ఈ చిత్రం త్వరలో మళ్ళీ పట్టాల ఎక్కనుందని సమాచారం.ఈ చిత్రాన్ని .అప్పట్లో ఈ చిత్రాన్ని బంగారం నిర్మించిన నిర్మాతలు చేత ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు.ఆ తర్వాత సీన్ లోకి సూర్య పేపర్ అధినేత నూకారపు సూర్య ప్రకాశరావు వచ్చారు.కానీ తర్వాత ఆ ప్రపోజల్ ఆగిపోయింది.అయితే పవన్ మాత్రం ఈ చిత్రం పై చాలా నమ్మకముంది.

అయితే ఈ చిత్రాన్ని తానే డైరక్ట్ చేయాలా లేక వేరేవారికి అప్పచెప్పాలనేదే ఇప్పుడు ఆయన్ని ఆలోచనలో పడేస్తున్న అంశం. ప్రస్తుతం పవన్ కాళీ ప్రాజెక్టులోనూ,గబ్బర్ సింగ్ ప్రాజెక్టులోనూ బిజీగా ఉన్నారు. తన కిష్టమైన చేగువేరా సిద్ధాంతాలను బలపరచటం,కామన్ ఫ్రొటక్షన్ ఫోర్స్ కి సంభందించిన వివరాలను విశదీకరించి అదో ఉద్యమంలా ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనలు ఈ చిత్రంలో చోటు చేసుకోనున్నాయని అంటున్నారు. పూర్తిగా పవన్ ఆలోచనలతో రూపొందే ఈ చిత్రం మరో జానిలా కాకుండా జల్సాలా విజయం సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

English summary
There are rumors in the media that Pawan Kalyan wants to revive his dream project Sathyagrahi and Allu Sirish is turning the producer for this film. But Sirish reacted to these rumors and tweeted ---Satyagrahi aa? I that that project was to be produced by A.M Ratnam and got shelved. I have no such plans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu