»   »  ‘కొత్త జంట’కు చిరు క్లాప్, మెగా సందడి(ఫోటోలు)

‘కొత్త జంట’కు చిరు క్లాప్, మెగా సందడి(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కొత్త జంట'. ఈ చిత్ర ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మెగాస్టార్, కేంద్రమంత్రి చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శిరీష్ పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు.

మూవీ మొగల్, ప్రముఖ నిర్మాత డి రామానాయుడు కెమెరా స్విచాన్ చేసారు. ఈ కార్యక్రమానికి ఇంకా అల్లు అర్జున్, నాగబాబు, సాయి ధరమ్ తేజ, అల్లు అరవింద్ ఫ్యామిలీ, నిర్మాతలు కెఎస్ రామారావు, దిల్ రాజు, బండ్ల గణేష్, బన్నీ వాసు తదితరులు హాజరయ్యారు. మెగా ఫ్యామిలీ రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ శిరీష్ బాడీలాంగ్వేజ్‌కు సరిపోయే కథతో, కొత్త లుక్‌తో దర్శకుడు చిత్రాన్ని వైవిధ్యంగా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారని తెలిపారు. మూస కథలు కాకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటించాలనుకున్న శిరీష్‌కు ఈ సినిమా సరికొత్తగా ఉంటుందని, అతనికి కథ చెప్పగానే పాత్రలోకి ఇన్వాల్వ్ అయ్యాడని, హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రమని మారుతి తెలిపారు. ఈ సినిమాకు కెమెరా: రీచర్డ్ ప్రసాద్, నిర్మాత: బన్నీవాసు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.

కొత్త జంట చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో చిరంజీవి, అల్లు అర్జున్, శిరీస్, మారుతి, అరవింద్, బన్నీ వాసు తదితరులు

ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొడుతున్న చిరంజీవి

కెమెరా స్విచాన్ చేస్తున్న మూవీ మొగల్ డి రామానాయుడు

ఇద్దరు తనయులతో అల్లు అరవింద్ దంపతులు

నాగబాబుతో అల్లు శిరీష్, పక్కనే సాయి ధరమ్ తేజ్

దర్శకుడు మారుతి, నిర్మాత బన్నీ వాసుతో అల్లు అర్జున్, శిరీష్

నిర్మాత కెఎస్ రామారావు, డి రామానాయుడులతో చిరంజీవి

చిరంజీవి చెవిలో ఏదో విషయం చెబుతున్న ఆయన బావమరిది అరవింద్

నిర్మాత రామానాయుడుతో చిరంజీవి మాటామంతీ

నిర్మాత బండ్ల గణేష్, డివివి దానయ్యలతో అల్లు అర్జున్

సాయి ధరమ్ తేజతో నాగబాబు

బన్నీ వాసు, దిల్ రాజులతో సాయి ధరమ్ తేజ్

English summary

 Allu Sirish’s second film Kotha Janta launched today and Claped by Chiranjeevi. The movie directed by Maruthi, who has earlier directed the films ‘Ee Rojullo’ and ‘Bus Stop’. Regina Cassandra(Routine Love Story Fame) is the heroine of this movie. This movie is said to be commercial entertainer unlike his debut movie Gouravam. Bunny Vass is producing the film under Geetha Arts banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X