»   »  అల్లు శిరీష్ ని అన్నయ్య అనేసిందేంటి? (వీడియో)

అల్లు శిరీష్ ని అన్నయ్య అనేసిందేంటి? (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తాము తీసే సినిమాలో లేదా సినిమాకు ముందు వదిలే ట్రైలర్ లోనే ఏదో ఒకటి మాట్లాడుకునే విషయం లేకపోతే జనం పట్టించుకోవటం లేదు. ఆ విషయం దర్శక,నిర్మాతలు బాగా గుర్తించినట్లున్నారు. అందుకే ఏదో ఒకటి జనాలు మాట్లాడుకునే విషయం పెట్టే ప్యాకేజ్ గా జనం ముందుకు వస్తున్నారు.

అలాగే తాజాగా అల్లు శిరీష్ తన చిత్రం శ్రీరస్తు శుభమస్తు ...ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో హీరోయిన్ లావణ్యా త్రిపాఠి...హీరోని అన్నయ్య అనేస్తుంది. అలా ఎందుకు అంది అంటే కథలో భాగం అయ్యింటుంది. మీరూ ఓ సారి ట్రైలర్ చూసి ఎందుకు అన్నదో గెస్ చేసి చూడండి.


Allu Sirish's Srirastu Subhamastu Theatrical Trailer

ఇక ఈ ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ట్రైలర్ లో ప్రతీ ఫ్రేమ్ ఇరగదీసేశారంతే అంటున్నారు అభిమానులు. అటు కామెడీ నుంచి ఇటు పంచ్ డైలాగ్స్ వరకూ.. ఎమోషన్స్ నుంచి సెంటిమెంట్స్ వరకూ సూపర్బ్ గా కుదిరాయి.


ముఖ్యంగా...'మనల్ని ఇష్టపడేవి మనుషులైన, వస్తువులైనా మన జీవితంలో నుంచి ఎంత పంపించి వేద్దామన్నా ఓ పట్టాన పోవు' అంటూ రావు రమేష్‌ చెప్పే డైలాగ్‌ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి అయితే.. ఎంత అందంగా కనిపించిందో.. అంతే అల్లరి చేసేసింది. హీరోని ఓ సారి అన్నయ్య అని.. ఓ సారి తమ్ముడు అని ఆడేసుకుంది.


ఆగస్టు 5న 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో శిరీష్ కు జతగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. ప్రస్తుత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకోగా.. త్వరలో ఆడియో లాంఛ్ కి డేట్ డిసైడ్ చేయనున్నారు. దానికి ముందే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడం విశేషం. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ చేసిన లవ్ స్టోరీ కావడంతో.. అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.


ప్రకాష్‌రాజ్‌, రావు రమేష్‌, తనికెళ్ల భరణి, సుమలత, రవి ప్రకాష్‌లు కీలక పాత్రలు పోషించారు. యువత, ఇంటిల్లిపాదిని అలరించే వినోదభరితమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రేమకథతో సాగే ఫ్యామిలీ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు. తమన్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.


English summary
Watch Srirastu Subhamastu Telugu Movie Theatrical Trailer Starring Allu Sirish, Lavanya Tripathi , Prakash Raj , Directed by Parasuram ( Bujji ) , Produced by Allu Aravind Music By SS Thaman from the Production House of Geethaarts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu