»   »  అల్లు అర్జున్ కొత్త చిత్రం ముహూర్తం ఈరోజే

అల్లు అర్జున్ కొత్త చిత్రం ముహూర్తం ఈరోజే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'అత్తారింటికి దారేది' తర్వాత త్రివిక్రమ్‌ ...అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. 'జులాయి' తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ రోజు(ఏప్రియల్ 10న) రామానాయుడు స్టూడియోస్ లో గ్రాండ్ గా సిని పెద్దల సమక్షంలో లాంచ్ చేస్తున్నారు నిర్మాత రాధాకృష్ణ. మరి కొద్ది సేపట్లో ఈ చిత్రం ఓపినింగ్ ఫోటోలతో కూడిన సమాచారం అందించనున్నాం.

ఆ మధ్య కొత్త ఆఫీసులో ఈ చిత్రానికి చెందిన పూజ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ ఫైనల్ చేసి మిగతా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పడ్డారు. సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంపై అభిమానులు భారీగానే అంచనాలు పెంచుకొంటున్నారు. ఇక ప్రస్తుతం సంగీత చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది.

Alluarjun -Trivikram's film muhartham today

దేవిశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఇదివరకు 'జులాయి'కి కూడా ఈయనే స్వరాలు సమకూర్చారు. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కబోతోంది. ఇందులో అల్లు అరవింద్‌ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరినట్టు సమాచారమ్‌. కథ ఇప్పటికే సిద్ధమైందట. మరో ప్రక్క అల్లుఅర్జున్‌ 'రేసుగుర్రం' రిలీజ్ కు రెడీ అయ్యింది.

'రేసు గుర్రం' చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇదే. చిత్రంలో అల్లు అర్జున్ క్యారక్టరైజేషన్ చాలా విభిన్నంగా ఉండబోతోందని దర్శకుడు చెప్తున్నాడు. ఫన్,యాక్షన్ కలిపి మరో కిక్ లా రూపొందిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ నెల 11 న ఈ చిత్రం విడుదల అవుతోంది.

English summary

 Alluarjun -Trivikram's radhakishna-samantha Devisri prasad production no 2 starts today in few minutes muhartham at ramanaidu studios.
Please Wait while comments are loading...