»   » పొట్టి గౌనుతో ఇబ్బంది పడ్డ సమంత..! (ఫోటోలు)

పొట్టి గౌనుతో ఇబ్బంది పడ్డ సమంత..! (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో 'అల్లుడు శీను' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన ఆడియో కూడా జరిగింది.

ఆడియో వేడుకకు తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖులను పిలిచి గ్రాండ్‌గా నిర్వహించారు. కొడుకు సినిమా కావడంతో బెల్లంకొండ భారీగా ఖర్చు పెడుతున్నారు. టాప్ హీరోయిన్ సమంతకు ఈ చిత్రం కోసం భారీగానే రెమ్యూనరేషన్ ముట్టజెప్పినట్లు సమాచారం. దీంతో పాటు మరో స్టార్ హీరోయిన్ తమన్నాతో ఐటం సాంగు చేస్తున్నారు.

ఏ విషయంలోనూ రాజీ పడకుండా సినిమాను లావిష్‌గా తెరకెక్కించారు. వివి వినాయక్ దర్శకత్వం, సమంత, తమన్నా, బ్రహ్మానందం లాంటి స్టార్స్‌ ఉండటం....యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రం ఉండబోతుండటంతో సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు యూనిట్ సభ్యులు.

కాగా...తాజాగా ఈచిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ విడుదలయ్యాయి. ఓ సాంగు చిత్రీకరణకు సంబంధించిన ఈ ఫోటోల్లో సమంత పొట్టి గౌను వేసుకుని కనిపిస్తోంది. ఫోటోల్లో సమంత ఫేస్ ఫీలింగ్ పరిశీలిస్తుంటే ఆమె ఈ కురచ గౌను వేసుకోవడం వల్ల ఇబ్బంది ఫీలైనట్లు స్పష్టమవుతోంది. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు....

అల్లుడు శీను

అల్లుడు శీను

టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకపై బెల్లంకొండ సురేష్ చిన్న కుమారుడు గణేష్ నిర్మిస్తున్నారు.

హీరోగా నిలబెట్టాలనే తాపత్రయం

హీరోగా నిలబెట్టాలనే తాపత్రయం

ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అనే కాన్సెప్టును ఫాలో అవుతున్న బెల్లంకొండ సురేష్ ....కొడుకు తొలి చిత్రాన్ని భారీగా తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ టాప్ బ్యూటీ సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా...తమన్నా ఐటమ్ పాట చేసింది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్లస్సవుతుంది

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్లస్సవుతుంది

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక ఆదివారం శిల్పకళావేదికలో గ్రాండ్‌గా జరిగింది. ఆడియోకు మంచి స్పందన వస్తుండటంతో సినిమాకు ఇది ప్లస్సవుతుందని అంటున్నారు.

గ్రాండ్‌గా ఆడియో వేడుక

గ్రాండ్‌గా ఆడియో వేడుక

ఆడియో వేడుకకు వెంకటేష్, రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరై ఆడియో సీడీలను ఆవిష్కరించారు. దిల్ రాజు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు.

సాయిశ్రీనివాస్ టాలెంట్

సాయిశ్రీనివాస్ టాలెంట్

ఇప్పటికే విడుదలైన ‘అల్లుడు శీను' ట్రైలర్లు పరిశీలిస్తే ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ డాన్స్‌లు ఇరగదీసాడని స్పష్టమవుతోంది. మరి పెర్ఫార్మెన్స్ పరంగా ఎన్ని మార్కులు సంపాదించుకుంటాడో సినిమా విడుదలైతేగానీ తెలీదు.

English summary
Alludu Sreenu is an upcoming 2014 Telugu comedy drama film directed by V. V. Vinayak. Produced by Bellamkonda Suresh on his banner Sri Lakshmi Narasimha Productions, the film marks the debut of his son Bellamkonda Sai Sreenivas as a hero with Samantha Ruth Prabhu, Brahmanandam and Prakash Raj playing important roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu