»   » ఇదే ఊపు రిలీజ్ అయ్యాక కూడా ఉంటే...

ఇదే ఊపు రిలీజ్ అయ్యాక కూడా ఉంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కొత్త హీరోను లాంచ్ చేయటమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అదే ఏ హీరో కుమారుడో అయితే రిలీజ్ కు ముందే ప్యాన్స్ తో క్రేజ్ క్రియేట్ అవుతుంది. అయితే నిర్మాత కుమారుడు లాంచ్ అవుతున్నాడంటే మనం వదలిన ప్రోమోలు, పాటలు, పోస్టర్స్ ని బట్టే సినిమాపై అంచనాలు ఏర్పడతాయి. తాజాగా బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయమవుతూ అల్లుడు శ్రీను చిత్రం రెడీ అవుతోంది. ఈ చిత్రం ప్రోమోలు, ఆడియో విడుదల అయ్యాక బిజినెస్ వర్గాల్లో మంచి క్రేజ్ ఏర్పడినట్లు సమాచారం. ఆ మేరకు బెల్లంకొండ సక్సెస్ అయినట్లే అంటున్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక...కుర్రాడి ఫెరఫార్మెన్స్ ని బట్టి మిగతా విషయాలు ఆధారపడి ఉంటాయి.

జీవితంలో ఎదగాలంటే రిస్క్‌ చేయాల్సిందే అనేది ఆ కుర్రాడు నమ్మిన సిద్ధాంతం. మరి అతను ఎదిగేందుకు ఎలాంటి సాహసాలు చేశాడో తెరపైనే చూడాలంటున్నారు వి.వి.వినాయక్‌. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'అల్లుడు శీను'. బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. సమంత కథానాయిక. తమన్నా ప్రత్యేక గీతంలో నర్తించింది. బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాత. ఈ నెల 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

‘Alludu Srinu’ has got lot of craze

చిత్ర సమర్పకుడు బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ ''శీను అనే కుర్రాడి కథ ఇది. అతను అల్లుడు శీనుగా ఎలా..ఎందుకు మారాడో తెరపై చూడాలి. వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో చిత్రాన్ని తీర్చిదిద్దారు. బ్రహ్మానందం, శ్రీనివాస్‌ల మధ్య సన్నివేశాలు సందడిగా సాగుతాయి. ఇటీవల విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది. దేవిశ్రీప్రసాద్‌ మరోసారి తనదైన శైలిలో హుషారైన గీతాలను అందించారు'' అన్నారు.

ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, రఘుబాబు, వెన్నెల కిశోర్, వేణు, ఫణి, ఫిష్ వెంకట్, పృధ్వి, జెన్ని, ప్రదీప్ రావత్, రవిబాబు, భరత్, ప్రవీణ్, ఆనంద్ భారతి, గుండు సుదర్శన్, అనంత్, అమిత్, నవీన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:కోన వెంకట్, రచన:గోపిమోహన్, కథ:కె.ఎస్.రవీంద్రనాధ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, స్టన్ శివ, రవివర్మ, వెంకట్, పాటలు:చంద్రబోస్, రామజోగయ్యశాస్ర్తీ, భాస్కరభట్ల, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, కెమెరా:్ఛటా కె.నాయుడు, సమర్పణ:బెల్లకొండ సురేష్, నిర్మాత:బెల్లంకొండ గణేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వి.వి.వినాయక్.

English summary
Out of all the films, ‘Alludu Srinu’ has got lot of craze as the movie has the top technicians of Tollywood. Producer Bellamkonda Suresh has roped in VV Vinayak, Chota K Naidu, Devi Sri Prasad, Samantha and Tamanna for the debut movie of his son Bellamkonda Srinivas. Producer has spent huge amount of money for a debut actor and this film will hit the theatre on July 24, 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu