»   »  నేను నటున్ని మాత్రమే, ఆ విషయాలు తెలీదు: రజనీకాంత్

నేను నటున్ని మాత్రమే, ఆ విషయాలు తెలీదు: రజనీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా త్వరలో 'కొచ్చాడయాన్' అనే 3డి చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. భారీ సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిన ఈచిత్రంలో ప్రధాన భూమిక పోషిస్తన్న రజనీకాంత్.....నాకు నటన తప్ప, ఈ టెక్నీలజీ గురించి ఏమీ తెలియదని చెబుతున్నారు.

కొచ్చాడయాన్ చిత్రానికి సంబంధించిన హిందీ ట్రైలర్ విడుదల కార్యక్రమం ముంబైలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సుభాష్ ఘై, శేఖర్ కపూర్, ఆర్ బాల్కి లాంటి ప్రముఖులు హాజరయ్యారు. అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది.

 Rajinikanth

ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ....'నాకు ఇదొక ఎమోషన్ మూమెంట్. చెప్పడానికి మాటలు రావడం లేదు. చాలా రోజుల తర్వాత నా స్నేహితులను కలుస్తున్నాను. చివరి సారిగా రోబో చిత్రం ద్వారా మీ ముందుకొచ్చాను. ఇప్పుడు భారీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 'కొచ్చాడయాన్' చిత్రంలో నటించాను. నేను కేవలం నటుడుని మాత్రమే. ఈ టెక్నాలజీ గురించి నాకు తెలియదు. ఆ భగవంతుడే నాతో ఈ సినిమా చేయించాడు. అంతా దైవ లీల' అని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.

'సౌందర్య చిన్నతనంలో బొమ్మలతో కూడిన పుస్తకాలను చదవడానికి ఆసక్తి చూపేది. నా భార్య సౌందర్యలోని టాలెంటును గమనించి ఎంకరేజ్ చేసింది. ప్రముఖులంతా నా కూతురును పొగుడుతుంటే గర్వంగా ఉంది. ఈచిత్రం అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను' అని రజనీకాంత్ వ్యాఖ్యానించారు.

English summary
South superstar Rajinikanth, part of hi-tech 3D film "Kochadaiiyaan" directed by his daughter Saundarya, humbly says he is only an actor and doesn't know anything about technology.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu