»   » ఫ్రెండ్ కోసం...కోర్టులో మెట్లక్కబోతున్న అక్కినేని అమ‌ల‌…!

ఫ్రెండ్ కోసం...కోర్టులో మెట్లక్కబోతున్న అక్కినేని అమ‌ల‌…!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మాజీ హీరోయిన్, హీరో నాగార్జున అక్కినేని సతీమణిగా, అఖిల్ కి తల్లిగా అమల అక్కినేని గత ఇరవై ఏళ్లుగా భాధ్యతలు నిర్వహిస్తూ సినిమాలను దూరం పెడుతూ వస్తున్నారు. అయితేత రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ మలయాళ సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. అమల తాజాగా ఓ మలయాళ సినిమాలో న్యాయవాది పాత్రను పోషిస్తున్నారని సమాచారం. తన స్నేహితురాలు మంజు వారియర్ కోసమే ఆమె ఈ సినిమా కమిటైందని సమాచారం.

Amala Akkineni To Make A Comeback With Manju Warrier

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది అమలా అక్కినేని. ఆంటోనీ సోనీ సారధ్యంలో డెబ్యూ మూవీగా వస్తున్న చిత్రం 'కేరాఫ్ సైరాబాను' అనే చిత్రంలోఆమె నటించనున్నారట. ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ లీడ్ రోల్ లో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో ఆనీ జాన్ అనే న్యాయవాది పాత్రలో అమలా కనిపించనుంది.

ఇప్పటికే స్క్రిప్టు, ప్రీపొడక్ష పనులన్నీ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా షూటింగ్ ఈ త్వరలోనే మొదలు కానుందని వివరించాయి.

English summary
Amala will play a pivotal role in the upcoming Manju Warrier project.The senior actress Amala will essay the role of an advocate in the movie, which will have Manju in the role of a simple homemaker.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu