twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీవితాలతో ఆడుకోవద్దు: కోడి పందాలపై అక్కినేని అమల

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రకృతి ప్రేమికురాలిగా, జంతు ప్రేమికురాలిగా పేరుతున్న అక్కినేని అమల గత కొంత కాలంగా జంతువుల రక్షణ కోసం ‘బ్లూ క్రాస్' అనే సంస్థను కూడా రన్ చేస్తోంది. స్టార్ హీరో నాగార్జున్ భార్య అయినప్పటికీ తనదైన దారిలో నడుస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

    తాజాగా సంక్రాంతి సంబరాల్లో చోటు చేసుకుంటున్న ఓ విషయం ఆమెను తీవ్రంగా బాధించింది. అది మరేదో కాదు కోడి పందాలు. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహించడంపై ఆమె విచారం వ్యక్తం చేసారు. కోడి పందాలు నిర్వహించడం అంటే కోళ్ల జీవితాలతో ఆడుకోవడమే. వాటిని హింసిస్తూ ఎంజాయ్ చేయడం క్రూరత్వమైన చర్య అని ఆమె అబిప్రాయ పడుతున్నారు.

     Amala felt sad for cock fights

    కాగా...కోడి పందాలు సాధారణంగా నిర్వహించుకోవచ్చని ఇటీవల కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయిదే కోడి పందాలపై బెట్టింగ్ పెట్టొద్దని, వాటికి కాళ్లకు కత్తులు లాంటి కట్టొద్దని కోర్టు స్పష్టంగా పేర్కొంది. అయితే చాలా చోట్ల బెట్టింగ్ రూపంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని తెలుస్తోంది.

    మరికొన్నిచోట్ల కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి వాటిని పందాల్లో విడుస్తున్నారు. ఈ కారణంగా అవి తీవ్ర గాయాలపాలైన మరణిస్తున్నాయి. ఈ పరిణామాలపై అమల విచారం వ్యక్తం చేసాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి అరికట్టడంలో విఫలం అయందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Actress turned Blue Cross activist Amala Akkineni wife of star hero Akkineni Nagarjuna has expressed her unhappiness over the cockfight in various parts of Andhra Pradesh on the occasion of Sankranthi festival.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X