Just In
- 7 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 8 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 8 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 9 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డైవర్స్ ఎఫెక్ట్:ఈ సారి అమలాపాల్ కెరీర్ పై దెబ్బ, ,మామగారి వల్లే ఈ దారుణం?
హైదరాబాద్: దక్షిణాది హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు విజయ్‌ల ప్రేమ పెళ్లి పెటాకులై, వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కావాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో మరో విషయం బయిటకు వచ్చింది. అమలా పాల్ పై అనధికార బ్యాన్ మొదలైందని తెలుస్తోంది. అందుతున్న సినీ వర్గాల సమాచారం ప్రకారం, అమలా పాల్ కెరీర్ పరంగా వెనక్కి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు.
ఇలా అమలాపాల్ పై అనఫీషియల్ గా బ్యాన్ పెట్టాలనే నిర్ణయం వెనక ఎల్ విజయ్ తండ్రి ఎల్. అలగప్పన్ ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఆయన ఓ పేరున్న నిర్మాత, నటడు, తమిళ సినిమా ఇండస్ట్రీ నిర్మాతలతో మంచి స్నేహ భాంధవ్యాలు ఉన్నవాడు కావటంతో ఇది జరుగుతోందంటున్నారు.
అమలాపాల్ కు అవకాశాలు ఇస్తే విజయ్ తండ్రితో తగువుపెట్టుకున్నట్లే అని భావించి ఆమెను దూరం పెట్టాలని సీనియర్ నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతలు కలిసి నిర్ణయం తీసుకున్నట్లు వార్త. అయితే ఇప్పటికే కమిటైన ధనుష్ చిత్రం వడ చెన్నైలో మాత్రం ఆమె కొనసాగనున్నారు.
Also Read: అమలాపాల్ డైవర్స్: నోరు విప్పిన భర్త, తేల్చి చెప్పిన షాకింగ్ నిజాలు
పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటున్న వీరు తమకు విడాకులు మంజూరు చేయాలని చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. అభిప్రాయభేదాల కారణంగా చాలా రోజులుగా విడివిడిగా ఉంటున్న ఈ ఇద్దరు తాజాగా పరస్పర అంగీకారం మీద విడాకులకు అప్లై చేసుకున్నారు.
Also Read: అమలాపాల్ కు టార్చర్, మామగారు చెప్పినవన్నీ అన్ని అబద్దాలే
ఇక ఈ విషయమై అమలా పాల్ మాత్రం మీడియా ముందుకు రావటానికి ఇష్టపడటం లేదు. దర్శకుడు ఎల్ విజయ్ సైతంమీడియాకు అందుబాటులో లేరు. ఈ విషయమై స్పందించేందుకు. వీరిద్దరిలో ఎవరో ఒకరు మాట్లాడితే తప్ప ఇందులో నిజా నిజాలు ఎంత అనేది మాత్రం తెలియదు.
మరిన్ని విశేషాలు స్లైడ్ షోలో...

అమలాపాల్ వైపు నుంచి
అమలా పాల్ మాత్రం ..విజయ్ నుంచి డబ్బు లేదా భరణం వంటి డిమాండ్లు ఏమీ చేయలేదు.

అప్పుడే విడాకులు
కోర్టు ఈ జంటకు ఆరు నెలల కాలవ్యవధి ఇచ్చింది. ఇది ముగిసిన తర్వాత వారిద్దరూ సమ్మతిస్తే విడాకులు మంజూరవుతాయి.

రెండేళ్ల క్రితం
రెండేళ్ల క్రితం దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అమలాపాల్. గతకొంత కాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారు అని వినిపించింది. తాజాగా వీరిద్దరూ విడాకులు కోరుతూ చైన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.

నా తప్పేమి లేదు
ఈ అంశంపై కొన్ని రోజుల క్రితమే విజయ్ బయటికొచ్చి విడకుల్లో తన తప్పేమీ లేదని చెప్పిన సంగతి తెలిసిందే.

అమలాపాల్ తరుపున
ఆమె తరఫున న్యాయవాది సాయిబ్ జోస్ కిడానగూర్ పిటిషన వేయగా, ఆ సమయంలో అమలాపాల్, విజయ్ ఇద్దరూ కోర్టుకు హాజరయ్యారు.

సినిమాల్లో నటిస్తూ..
విజయ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో అమలాపాల్ హీరోయినగా నటించడం, ఇద్దరూ ప్రేమలో పడడం, పెద్దల అంగీకారంతో రెండేళ్ల క్రితం ఎంతో ఆర్భాటంగా వీరు పెళ్లి చేసుకోవడం తెలిసిందే.

ఖండించారు
కానీ, పెళ్లి తరువాత కూడా అమలాపాల్ సినిమాల్లో నటించడం విజయ్‌కి ఇష్టం లేదని, ఆ కారణంతోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని కథనాలు వచ్చాయి. విజయ్ ఈ వార్తలను ఖండించారు.

ఇంకోవైపు
మరోవైపు, అమలాపాల్ కూడాఇప్పటికే మూడు సినిమాలకు ఒప్పుకున్నారు. కారణమేదైనా, వీరు విడాకులకు సిద్ధమయ్యారు.

విజయ్ కూడా
విజయ్ సైతం మ్యూచువల్ కన్సంట్ తో అమల నుంచి విడిపోవడానికి పిటిషన్ వేసినట్లు సమాచారం.

ఇద్దరికీ ఇష్టమే కాబట్టి
దీంతో అమల-విజయ్ త్వరలోనే విడిపోనున్నారని తేలిపోయింది. కొన్ని నెలల్లోనే ఈ ప్రక్రియ ముగిసిపోవచ్చు.

హీరోయిన్ గా
సింధు సమవేలి అనే బి-గ్రేడ్ సినిమాతో హీరోయిన్ గా పాపులర్ అయింది అమలా. ఆ తర్వాత మైనా సినిమా ఆమెకు ఎనలేని పేరు తెచ్చిపెట్టింది.

మీడియాకు నో
విడాకుల వార్తలపై.. తనపై వచ్చిన విమర్శలపై ఒక్క మాటా మాట్లాడటానికి ఇష్టపడలేదు అమలాపాల్

తలైవా సమయంలో
నాన్న సినిమా సందర్భంగానే వీళ్లిద్దరికీ పరిచయమైంది. తర్వాత తలైవా అనే ఇంకో సినిమా చేశారు. అప్పుడే వాళ్లిద్దరి బంధం బలపడింది.

భర్త స్పందన
విజయ్ స్పందిస్తూ ...తాము విడిపోవడానికి కారణమేమిటో తనకు మాత్రమే తెలుసునన్నారు. తామిద్దరం విడిపోతామని కలలో కూడా వూహించలేదంటూనే నమ్మకం, నిజాయితీ లేనప్పుడు దాంపత్య జీవితాన్ని కొనసాగించడంలో అర్థం లేదన్నారు.

తెలుగువారికి
‘బెజవాడ', ‘నాయక్', ‘ఇద్దరమ్మాయిలతో' సినిమాల ద్వారా తెలుగువారికి సుపరిచితురాలయ్యారు హీరోయిన్ అమలాపాల్.

పూర్తి స్వేచ్చ
తన భర్త విజయ్ నటించడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని కూడా అమలాపాల్ గతంలో పలుమార్లు ప్రస్తావించారు.

అయితే ...
కొంతకాలంగా వీరిరువురి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు తెలుస్తోంది. వీరిద్దరు విడిపోయారని పలు పత్రికలు కూడా ఇటీవల వార్తలు రాస్తూ పలు కారణాలను ప్రస్తావించాయి.

అప్పడే..
2014లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే వీళ్లిద్దరూ విడిపోవడం విచారం కలిగించే విషయం.

కుటుంబంపై నింద
ముఖ్యంగా విజయ్ కుటుంబం ఈ విషయంతో మీడియాలోనూ, అబిమానులతోనూ విమర్శలు పాలు అవుతోంది. కావాలనే కుటుంబం ఆమెను దూరం పెడుతోందని, ఆమె కెరీర్ ఆశలు అత్త, మామలు చంపేసే ప్రయత్నం చేసారని, వాళ్లని విలన్స్ గా క్రియేట్ చేస్తూ కథనాలు వెలువడుతున్నాయి.

ప్లీజ్ ..వద్దు
దయచేసి ఇది మా కుటుంబ విషయం, దాన్ని గౌరవించండి. మా పర్శనల్ స్పేస్ మాకు వదలండి.రూమర్స్ ప్రచారం చేయవద్దు