»   » అమలా పాల్ హనీమూన్ స్వీట్ మెమెురీస్ (ఫోటో ఫీచర్)

అమలా పాల్ హనీమూన్ స్వీట్ మెమెురీస్ (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu


హైదరాబాద్: పెళ్లికి ముందు.....చాలా మంది జంటలు తమ హనీమూన్ గురించి ఎన్నోకలలుగంటారు. జీవితంలో మరపురాని ఈ ఘట్టాన్ని ఎంతో స్పెషల్‌గా, సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటారు. అందుకే పెళ్లయిన వెంటనే ప్రపంచంలో తమకు నచ్చిన ప్రదేశానికి వెళ్లి హాయిగా సేదతీరుతారు. ఆనంద తీరాలను తాకివస్తారు. ఆ జ్ఞాపకాలను జీవితాంతం స్వీట్ మెమోరీస్‌గా గుర్తుంచుకుంటారు.

ఇటీవలే దర్శకుడు ఎఎల్ విజయ్‌తో హీరోయిన్ అమలా పాల్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇద్దరూ మాల్దీవులకు హనీమూన్ ట్రిప్ వెళ్లారు. దాదాపు 10 రోజుల పాటు తనివితీరా హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేసారు. హనీమూన్ తీపి జ్ఞాపకాలను మనసు లోతుల్లో భద్రపరుచుకుని తిరిగి చెన్నై చేరుకున్నారు.

తమ హనీమూన్ ముగిసిన విషయాన్ని వెల్లడిస్తూ అమలా పాల్ సోషల్ నెట్వర్కింగులో ఓ ఫోటోను పోస్టు చేసింది. మనీమూన్ జంటలకు మాల్దీవులు ఎంతో అందమైనా, ఆహ్లాదకరమైన స్వర్గధామంలా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.

కాగా హనీమూన్ ట్రిప్ వెళ్లిన సందర్భంగా సోషల్ నెట్వర్కింగు ద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులను కూడా అమలాపాల్ ఎదుర్కొన్నారు. అందుకు సంబంధించిన విరవాలు స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

హ్యాపీగా సాగిన హనీమూన్

హ్యాపీగా సాగిన హనీమూన్

ఇలా సముద్ర తీరంలో రిలాక్స్ అవుతున్న ఫోటోను అమలా పాల్ పోస్టు చేసింది. దీన్ని బట్టి ఇద్దరూ హనీమూన్ చాలా బాగా ఎంజాయ్ చేసారని స్పష్టమవుతోంది.

ఇబ్బందులు పడింది

ఇబ్బందులు పడింది

తమ హమీమూన్ మాల్దీవుల్లో జరుపుకుంటున్నామనే విషయాన్ని తెలియజేస్తూ అమలా పాల్ కొన్ని ఫోటోలు పోస్టు చేసింది. ఈ ఫోటో పోస్టు చేయగానే కొందరు అభిమానులు అభినందనలు చెబుతూ కామెంట్స్ చేయగా....కొందరు మాత్రం అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు, ఆమెకు ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేసారు. దీంతో అమలా పాల్ చాలా అప్ సెట్ అయింది. వెంటనే తమ హనీమూన్ ఫోటోలు డిలీట్ చేసింది.

వివాహం

వివాహం

ఇకపోతే....అమలా పాల్-ఏఎల్ విజయ్ వివాహం ఈ నెల 12న చెన్నైలో జరిగిన సంగతి తెలిసిందే.

హిందూ సంప్రదాయం ప్రకారం

హిందూ సంప్రదాయం ప్రకారం

ఏఎల్ విజయ్ హిందు, అమలా పాల్ క్రిస్టియన్. అయితే వీరి ఎంగేజ్మెంట్ క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం, వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది.

లవ్ బర్డ్స్

లవ్ బర్డ్స్

ఏఎల్ విజయ్, అమలా పాల్ మద్య గత కొంత కాలంగా ప్రేమాయణం సాగుతోంది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో అమలా పాల్ పలు చిత్రాల్లో నటించింది.

English summary
Amala Paul, who was recently in Maldives, enjoying her small honeymoon trip with her hubby and director AL Vijay, has reportedly been back. The actress is in the hangover of the trip and shares her experiences in Maldives.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu