ఆ స్టార్ తో చెయ్యటం లేదని అమలా పాల్ ఖండన
""నేను కొత్త సినిమా సైన్ చేసానంటూ వస్తున్న రూమర్స్ అన్నీ ఆధారం లేనివే... అవి ఎలా ఉన్నాయంటే జింబాంబ్వే వరల్డ్ కప్ గెలిచిన వార్తల్లా ఉన్నాయి !! అలాంటిదేమన్నా జరిగితే మీడియా వారికి నేనే తప్పకుండా తెలియచేస్తాను...నా తదుపరి చిత్రం ఏమిటన్నది కూడా త్వరలో చెప్తాను ...," అని అమలా పాల్ పోస్ట్ చేసింది.
మైనా'(ప్రేమ ఖైదీ) తో అద్భుత నటన ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ అమలాపాల్. తాజాగా 'తలైవా'(అన్న) తో మళ్లీ జనాల్ని అలరిస్తోంది. రెండు పాత్రల్లో భిన్నమైన నటన ప్రదర్శించి శెభాష్ అనిపించుకుంటోంది. స్టార్ హీరోయిన్స్ జాబితాలోనూ చేరిపోయింది. తానలా నటించడానికి విజయ్ కూడా ఓ కారణమని చెబుతోంది అమలాపాల్.
అమలా పాల్ మాట్లాడుతూ...నేను చిన్న నటిని. విజయ్‌లాంటి స్టార్ హీరోల సరసన అవకాశం దక్కడం నిజంగా అదృష్టం. షూటింగ్ స్పాట్‌లో, నటించేటప్పుడు, డ్యాన్స్ చేసేటప్పుడు విజయ్ ఎలా ఉంటారోనని భయపడేదాన్ని. ఎలాంటి భేషజాలు లేకుండా కలసిపోయారు. కొన్ని సందర్భాలల్లో ఆశించిన స్థాయిలో నటించలేకపోయా. అప్పుడు విజయ్ చిట్కాలు నేర్పారు. ఆ తర్వాత చాలా సులువుగా నటించేశా. స్టార్ హీరోలతో నటించేటప్పుడు నేనుకూడా నటనలో అభివృద్ధి చెందుతున్నాననేనమ్మకం వస్తోందని చెప్పారు.


Click it and Unblock the Notifications












