అమలాపాల్ పెళ్లి వార్త నిజమే
హైదరాబాద్ : మరో సినీ ప్రేమజంట పెళ్లిపీటలెక్కనుంది. 'ఇద్దరమ్మాయిలతో', 'బెజవాడ', 'నాయక్' చిత్రాల హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు ఏఎల్ విజయ్‌ని పెళ్లాడనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని అమలా పాల్ సైతం ధృవీకరిస్తోంది. 'నాన్న', 'అన్న' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఏఎల్ విజయ్ పరిచయమే.
ప్రస్తుతం విజయ్ తమిళంలో 'సైవం' అనే బాలల చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు వార్తలొచ్చినా కాదని కొట్టిపారేసిందీ జంట. ఇప్పుడు వీరిద్దరికీ జూన్ 12న వివాహం జరుగనున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
వివాహానికి సంబంధించి తమిళ మీడియాలో వస్తున్న వార్తలపై అమలాపాల్ స్పందిస్తూ, ''ప్రస్తుతం విజయ్ అమెరికా వెళ్లారు. తిరిగి చెన్నై వచ్చాక పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటిస్తాను''అని చెప్పింది.

ప్రేమఖైదీ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కోచ్చి సుందరి అమలాపాల్. ఆ చిత్రంలో ఓ గ్రామీణ యువతి పాత్రలో సహజసిద్ధంగా నటించి మెప్పించింది ఈ సుందరి. ఈ సినిమా విడుదలకు ముందే నాగచైతన్యతో 'బెజవాడ'లో నటించే అవకాశం సైతం దక్కించుకుందీ భామ. ఇతర కథానాయకల్లా గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారమున్న స్క్రిప్టులను ఎంపికచేసుకుని తెలివిగా ముందడుగేస్తోందీ సుందరి.
తొలిచిత్రంతోనే జాతీయ అవార్డ్ అందుకోవడమే గాకుండా ప్రతిష్ఠాత్మక ఫిలింఫేర్‌కు కూడా నామినేట్ అయ్యింది. ఇటీవల 'దైవ తిరుమగల్'తో తమిళంలో విజయాన్ని నమోదుచేసుకుంది. అదే సినిమా తెలుగులో 'నాన్న'గా విడుదలై ..ఇక్కడా గుర్తింపును పెంచింది. ఇద్దరమ్మాయిలతోనూ ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత చేసిన నాయిక్ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది.


Click it and Unblock the Notifications











