»   » పెళ్లి తర్వాత హీరోయిన్ అమలా పాల్....అన్నీ బంద్!

పెళ్లి తర్వాత హీరోయిన్ అమలా పాల్....అన్నీ బంద్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అమలా పాల్, తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ మధ్య నిన్నమొన్నటి వరకు చాటు మాటుగా సాగిన ఎఫైర్...ఇపుడు అఫీషియల్ అయిపోయింది. ఇద్దరూ త్వరలో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారు. జూన్ 12న వీరి వివాహం చెన్నైలో జరుగబోతోంది.

తాజాగా కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పెళ్లి తర్వాత అమలా పాల్ నటనకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాల జోలికి రాకుండా పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఆలోచనలో ఉందట. అమలా పాల్ నటనకు స్వస్తి చెప్పబోతోందనే వార్తలు వినగానే ఆమె అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం అమలా పాల్ పూర్తి చేయాల్సిన కొన్ని సినిమాలు మిగిలి ఉన్నాయి. తెలుగులో లైలా ఓ లైలా, వస్తా నీ వెనక, తమిళంలో మరో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.

అమలా పాల్ మళయాలం చిత్ర పరిశ్రమలో తొలుత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ ప్రారంభించింది. ఆమె నటించిన తొలి చిత్రం 2009లో వచ్చిన మళయాల చిత్రం నీలతామర. వీరశేఖరన్ అనే చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. సింధు సమవెల్లి అనే తమిళ చిత్రంలో పోషించిన సుందరి అనే వివాదాస్పద క్యారెక్టర్‌తో ఆమెకు గుర్తింపు వచ్చింది. తమిళంలో వచ్చిన 'మైనా' అనే చిత్రంలో ఆమెకు మంచి బ్రేక్ వచ్చింది. తెలుగులో బెజవాడ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన అమలా పాల్ నాయక్, ఇద్దరమ్మాయిలతో లాంటి చిత్రాలతో ఆకట్టుకుంది.

స్నేహం ప్రేమగా మారింది

స్నేహం ప్రేమగా మారింది

సినిమా పరిశ్రమ ద్వారా జరిగిన పరిచయాలతో స్నేహితులుగా మారిన అమలా పాల్, ఎఎల్ విజయ్....క్రమక్రమంగా తమ స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్నారు.

అప్పట్లో అలాంటిదేమీ లేదన్నారు

అప్పట్లో అలాంటిదేమీ లేదన్నారు

చాలా కాలంగా వీరి మధ్య ఎఫైర్ నడుస్తోంది. ఆ మధ్య ఈ వార్తలు మీడియాకు లీక్ అయ్యాయి. అయితే వారు మాత్రం తమ మధ్య అలాంటిదేమీ లేదని ఆ వార్తలను ఖండించే ప్రయత్నం చేసారు.

విజయ్ ద్వారా బయటకు

విజయ్ ద్వారా బయటకు

ఏప్రిల్ 26వ తేదీన విజయ్ తనకు, అమలా పాల్ మధ్య ఉన్న సంబంధం గురించి బయట పెట్టారు. ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రెస్ నోట్ విడుదల చేసారు.

అమలా పాల్-ఎఎల్ విజయ్

అమలా పాల్-ఎఎల్ విజయ్

2011లో ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన ఓ తమిళ చిత్రం (తెలుగులో విక్రమ్ హీరోగా వచ్చిన ‘నాన్న') షూటింగులో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది

ప్రేమతో...

ప్రేమతో...

అమలా పాల్‌పై ప్రేమ పెంచుకున్న దర్శకుడు ఎఎల్ విజయ్....తమిళ హీరో విజయ్‌తో తీసిన ‘తలైవా'(తెలుగులో ‘అన్న') చిత్రంలో ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నాడు.

English summary
Amala Paul's relationship with director Vijay is now official. The buzz says that Amala Paul is all set to bid goodbye to acting. The Mallu babe wants to enjoy the married bliss. So, she will not be acting anymore. Rumour mills add that the actress loves to be housewive and has decided to end her career.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu