twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోటి రూపాయలు కట్టా, నేరం చేయలేదు, ఆ వార్తలకు బాధేసింది: అమలా పాల్

    తాను టాక్స్ ఎగ్గొట్టినట్లు వార్తలు రావడంపై హీరోయిన్ అమలా పాల్ రియాక్ట్ అయ్యారు. తపై వస్తున్నవి తప్పుడు వార్తలే అని, తాను ఏ నేరం చేయలేదని ఆమె తెలిపారు.

    By Bojja Kumar
    |

    హీరోయిన్ అమలా పాల్ మీద కొన్ని రోజులుగా మీడియాలో రకరకాల ఆరోపనలు వినిపిస్తున్నాయి. కారు విషయంలో టాక్స్ ఎగ్గొట్టిందని, నేరం చేసిందని, జైలుకెళ్లే అవకాశం ఉందంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి.

    ఈ వార్తలపై అమలా పాల్ స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదని, తపై వస్తున్న వార్తలన్నీ పచ్చి అబద్దం అంటూ ఆమె ట్విట్టర్ ద్వారా ప్రెస్ నోట్ విడుదల చేశారు.

    నాపై వార్తలు చూసి షాకయ్యాను

    నాపై వార్తలు చూసి షాకయ్యాను

    ‘మలబార్‌ ప్రాంతానికి చెందిన ఓ పాత కాలం నాటి పత్రిక పాపులారిటీ కోసం, పత్రిక సర్వ్కులేషన్ పెంచుకోవడం కోసం నాగురించి తప్పుడు వార్తలు రాయడం చూసి షాకయ్యాను. ఇలాంటి తప్పుడు వార్తలపై స్పందించే హక్కు నాకు ఉంది... అంటూ అమలా పాల్ ప్రెస్ రిలీజ్‌లో పేర్కొన్నారు.

    కోటి రూపాయలకు పైగా టాక్స్ కట్టాను

    కోటి రూపాయలకు పైగా టాక్స్ కట్టాను

    నా కొత్త కారు కోసం కోటి రూపాయలకు పైగా టాక్స్ కట్టాను. కానీ పన్ను ఎగ్గొట్టి కారు కొన్నట్లు రాశారు. ఈ తప్పుడు వార్త చూసి నేను ఆశ్చర్య పోయారు. నేను ఏ తప్పూ చేయలేదని స్వయంగా చెప్పినా నాపై ఇంకా అలాంటి ప్రచారమే జరుగుతోంది.... అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

    నేను, నా కుటుంబం చాలా బాధ పడ్డాం

    నేను, నా కుటుంబం చాలా బాధ పడ్డాం

    ఈ వార్తలు చూసి నేను, నా కుటుంబం చాలా బాధ పడ్డాం. చేయని తప్పుకు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం చాలా దారుణం.... అని అమలా పాల్ తన లేఖలో పేర్కొన్నారు.

    నమ్మకాన్ని పోగొట్టుకుంటోంది

    నమ్మకాన్ని పోగొట్టుకుంటోంది

    తనపై తప్పుడు వార్తలు రాయడం ద్వారా ఆ పత్రిక తన చరిత్రను తానే చెరిపేసుకుంటోంది, నమ్మకాన్ని పోగొట్టుకుంటోంది... అంటూ అమలా పాల్ ఘాటుగా స్పందించారు.

    అది నా హక్కు

    అది నా హక్కు

    ‘నేను భారతీయురాలిని. ఈ దేశంలో ఎక్కడైనా పనిచేసే హక్కు ఉంది. తాను కోరుకున్న వస్తువును చట్టబద్దంగా సొంతం చేసుకునే హక్కు కలిగి ఉన్నాను అని అమలా పాల్ పేర్కొన్నారు. నేను తమిళంలో, మళయాలంలో, తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నాను. ఇవి నా ఇష్ట ప్రకారం చేస్తున్న పనులు, ఇందుకోసం ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు అని అమలా పాల్ అన్నారు.

    ప్రాంతీయ బేధాలు వద్దు, భారతీయులుగా ఉందాం

    ప్రాంతీయ బేధాలు వద్దు, భారతీయులుగా ఉందాం

    ‘ఒకే దేశం ఒకే పన్ను విధానం వచ్చిన తర్వాత కూడా రాష్ట్రాల వారీగా ప్రజలను వేర్వేరుగా చూడటం బాధాకరం. కేరళీయులు, తమిళియన్లు, పంజాబీలు, గుజరాతీలు అనే పదాలు రాబోయే తరాలకు ఉండకూడదు. మనం అంతా భారతీయులుగా ఉందాం, దేశ అభివృద్ధి కోసం కలిసి పని చేద్దాం.... అని అమలా పాల్ పేర్కొన్నారు.

    అంతా కలిసి కట్టుగా పోరాడదాం

    అంతా కలిసి కట్టుగా పోరాడదాం

    పేదరికం, అన్యాయం, అవినీతి, నిరక్షరాస్యతకు పారద్రోలేందుకు అంతా కలిసి కట్టుగా పోరాడదాం. స్వల్ప దృష్టిగల లాభాల కోసం చట్టాన్ని అతిక్రమించి పౌరులను ఇబ్బందులకు గురిచేయకూడదు అని అమలా పాల్ సూచించారు.

    English summary
    Amala Paul was recently in trouble for alleged tax evasion by registering her luxury car in Puducherry. The car, according to reports, was registered in the name of a engineering student in Puducherry who denied having any connection with the actress. The Motor Vehicle Department had issued her a notice summoning her for a hearing for evading a huge sum of tax. Amala, on Thursday evening, sent out an official statement on the issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X