For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అబ్బాయిలు తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే...: అమలా పాల్

  By Srikanya
  |

  హైదరాబాద్ : 'అబ్బాయిలు తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్లొద్దని మా అమ్మగారు చెప్పారండీ...' - ఈ డైలాగ్‌ గుర్తుందా? అసలు మరిచిపోయే డైలాగాండీ ఇదీ. 'ఇద్దరమ్మాయిలతో' సినిమాకోసం స్పెయిన్‌లో ఈ సన్నివేశాల్ని చిత్రీకరించడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ డైలాగ్‌ని బట్టీ పట్టడానికి నేను కొంచెం సమయం తీసుకొన్నాను అంటూ గుర్తు చేసుకుంది అమలా పాల్.

  అలాగే అల్లు అర్జున్‌, పూరి జగన్నాథ్‌తో కలిసి పనిచేయడం మరిచిపోలేని అనుభవం. ఇందులోని కోమలి శంకరాభరణం అనే పాత్ర నా మనసుకి బాగా నచ్చింది. ఆ కట్టుబొట్టుతో కెమెరా ముందుకు వెళ్లినప్పుడే ఎంతో సంతోషం కలిగింది. భవిష్యత్తులోనూ ఈ తరహా పాత్రలు చేయాలనుంది అంది. సినిమాలో నా పాత్రేమిటి? ఎంతసేపు కనిపిస్తాను? ఎంత మంది హీరోయిన్స్ ? ఇలాంటి విషయాలేవీ నేను పట్టించుకోను.

  ఇక నేను మలయాళం అమ్మాయిని. కానీ తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించిన విధానం ఎప్పటికీ మరిచిపోలేను. 'ప్రేమఖైదీ' మొదలుకొని నా ప్రతీ సినిమాని ఆదరిస్తున్నారు. చాలామంది అభిమానులు మీరు అచ్చం తెలుగమ్మాయిలాగే ఉంటారని చెబుతుంటారు. అప్పుడు నా మనసుకు ఎంత సంతోషం కలుగుతుందో మాటల్లో చెప్పలేను అంది.

  అమలా పాల్ ముచ్చట్లు స్లైడ్ షో లో...

  'జెండాపై కపిరాజు' గురించి...

  'జెండాపై కపిరాజు' గురించి...

  ఇప్పుడు నానితో కలిసి చేస్తున్న 'జెండాపై కపిరాజు' చిత్రంలోని నా పాత్ర నా సినీ జీవితంలో ఓ మైలు రాయిగా మిగిలిపోతుంది. నేనెలాంటి పాత్ర చేస్తున్నానన్న విషయం కంటే ఒక మంచి చిత్రంలో నటిస్తున్నానన్న తృప్తే ఎక్కువ. సమాజంలో మార్పు అవసరం అని చెప్పే ఇలాంటి కథలు విరివిగా తెరకెక్కితే చాలా బాగుంటుంది అంది.

  డ్రీమ్ ప్రాజెక్టు

  డ్రీమ్ ప్రాజెక్టు

  నాకు కలల ప్రాజెక్టులంటూ ఏమీ లేవు కానీ... 'బర్ఫీ' తరహా చిత్రాల్లో ఓ చిన్న పాత్ర చేసినా చాలనిపిస్తుంటుంది. అలాంటి అవకాశాలు తప్పకుండా సాధిస్తానన్న నమ్మకం నాలో ఉంది. త్వరలోనే అలాంటి పాత్రల్లోనే కనిపిస్తాను అనే ధీమా వ్యక్యం చేస్తోంది.

  లవ్ ఎఫైర్ గురించి...

  లవ్ ఎఫైర్ గురించి...

  నేను ప్రేమలో పడటం నాకు కొత్తకాదు. స్కూల్‌ రోజుల్లోనే పడిపోయాను. ఆగండాగండి. అది నిజంగా ప్రేమ కాదు. ఆకర్షణ. మా అన్నయ్యకి ఓ ఫ్రెండ్‌ ఉండేవాడు. తనంటే ఏదో తెలియని ఇది. ఆ తర్వాతే తెలిసింది ఇది ఒట్టి ఆకర్షణ అని. హీరోయిన్ ని అయ్యాక అభిమానులు పెరిగారు. ఉత్తరాలు కూడా రాస్తుంటారు. అయితే ప్రేమిస్తున్నట్టు మాత్రం ఎవరూ రాయడం లేదులెండి అని తేల్చేసింది.

  అలాంటి వాళ్లు గిట్టరు...

  అలాంటి వాళ్లు గిట్టరు...

  మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకలా కనిపించేవాళ్లంటే నాకు అస్సలు నచ్చదు. అలాంటివారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాను. మంచి నడవడికతో కనబడేవాళ్లతో తొందరగా కలిసిపోతుంటాను. పెళ్లి గురించి ఇప్పుడే ఏమీ ఆలోచించడం లేదు. నేను చిత్ర పరిశ్రమలో సాధించాల్సింది చాలా ఉంది. ఇప్పుడిప్పుడే మంచి చిత్రాల్లో భాగం అవుతున్నాను అంది.

  నా టెన్షన్ రిలీఫ్

  నా టెన్షన్ రిలీఫ్

  ఏ వృత్తిలో ఉన్నవాళ్త్లెనా అప్పుడప్పుడు ఇలా స్నేహితుల్ని కలవడం అలవాటు చేసుకోవాలి. మనసులోని చిన్న చిన్న ఒత్తిళ్లన్నీ మటుమాయమైపోతాయి. సినిమాతోనే కాకుండా బయటి ప్రపంచంతోనూ నాకు అనుబంధం ఉంది. ఎప్పుడైనా బోర్‌గా అనిపిస్తే నా స్కూల్‌మేట్స్‌కీ, కాలేజ్‌ స్నేహితులకీ ఫోన్‌ చేస్తాను. అందరినీ ఒకచోటకి రమ్మని కబురుపెడతాను. ఇక వాళ్లతో కలిసిపోయానంటే సమయమే కనిపించదు. ఎన్ని కబుర్లో. ఒకరినొకరు కొట్టుకోవడం తిట్టుకోవడం ఆ సరదాలే వేరు.

  ప్రేమ, పెళ్లి

  ప్రేమ, పెళ్లి

  ఆ కబుర్లను ఇప్పట్లో నా నుంచి వినలేరు. ప్రస్తుతం తమిళంలో 'తలైవా', 'నినిమ్దు నిల్‌' చిత్రాల్లో నటిస్తున్నాను. ఈ రెండూ కూడా నన్ను ప్రేక్షకులకి మరింత దగ్గర చేస్తాయన్న నమ్మకముంది. ఎప్పటిలా నన్నూ నా సినిమాలనూ ఆదరిస్తారని కోరుకొంటున్నారు. ఇతర రంగాల్లో మాదిరిగా సినిమాల్లోనూ పోటీ వాతావరణం ఉంటుంది. మరీ చెప్పాలంటే ఇక్కడే ఎక్కువంటాను. అయినా సరే... ఎప్పుడూ ఒత్తిడికి గురికాను. ప్రతీక్షణం ఆత్మవిశ్వాసంతో మెలుగుతుంటాను. అదే నన్ను ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టిందని నమ్ముతుంటా.

  నాకు ఈ పని చాలా కష్టం...

  నాకు ఈ పని చాలా కష్టం...

  సినిమాకి సంబంధించి నాకు కష్టమైన పని ఏదైనా ఉందంటే... సీరియస్‌గా సాగే సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు నవ్వును ఆపుకోవాల్సి రావడమే! అయితే మనసుకి కష్టం కలిగినప్పుడు ఎవ్వరైనా బాధపడాల్సిందే. దానికి నేను కూడా మినహాయింపేమీ కాదు. కానీ ఆ వెంటనే మనకు మనం ధైర్యం తెచ్చుకోవాలి. తదుపరి కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయాలి. నేనదే చేస్తుంటాను.

  ఇదీ నా థీరి

  ఇదీ నా థీరి

  పనిని ప్రేమించడం. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ గడపడం. నా చుట్టూ ఉన్న వాళ్లందరికీ నేను ఇదే చెబుతుంటాను. ప్రతీ క్షణాన్నీ ఆనందంగా గడిపేందుకు ప్రయత్నించండి. - మీ అమలాపాల్‌ గా మీ అందరికీ గుర్తుండిపోవాలనేది నా కోరిక అంటూ చెప్పింది.

  English summary
  
 Amala Paul says that she is very much happy with Telugu Films. And she said her last film Iddarammayilatho is a good and lovely film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X