»   »  భయపడేదాన్ని,చిట్కాలు నేర్పారు:అమలా పాల్

భయపడేదాన్ని,చిట్కాలు నేర్పారు:అమలా పాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : 'మైనా'(ప్రేమ ఖైదీ) తో అద్భుత నటన ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ అమలాపాల్‌. తాజాగా 'తలైవా'(అన్న) తో మళ్లీ జనాల్ని అలరిస్తోంది. రెండు పాత్రల్లో భిన్నమైన నటన ప్రదర్శించి శెభాష్‌ అనిపించుకుంటోంది. స్టార్ హీరోయిన్స్ జాబితాలోనూ చేరిపోయింది. తానలా నటించడానికి విజయ్‌ కూడా ఓ కారణమని చెబుతోంది అమలాపాల్‌.

అమలా పాల్ మాట్లాడుతూ...నేను చిన్న నటిని. విజయ్‌లాంటి స్టార్ హీరోల సరసన అవకాశం దక్కడం నిజంగా అదృష్టం. షూటింగ్‌ స్పాట్‌లో, నటించేటప్పుడు, డ్యాన్స్‌ చేసేటప్పుడు విజయ్‌ ఎలా ఉంటారోనని భయపడేదాన్ని. ఎలాంటి భేషజాలు లేకుండా కలసిపోయారు. కొన్ని సందర్భాలల్లో ఆశించిన స్థాయిలో నటించలేకపోయా. అప్పుడు విజయ్‌ చిట్కాలు నేర్పారు. ఆ తర్వాత చాలా సులువుగా నటించేశా. స్టార్ హీరోలతో నటించేటప్పుడు నేనుకూడా నటనలో అభివృద్ధి చెందుతున్నాననేనమ్మకం వస్తోందని చెప్పారు.

అలాగే మలేషియాలో 'దైవతిరుమగల్‌' చిత్రీకరణ జరుగుతున్నప్పుడు దర్శకుడు విజయ్‌ కొత్త సినిమా కథ చెప్పారు. డ్యాన్స్‌పై ఆసక్తి ఉన్న అమ్మాయిగా, పోలీసు అధికారిణిగా కనిపించాల్సి ఉందన్నారు. చాలారోజుల తర్వాతే ఇందులో విజయ్‌ నటిస్తున్నారని, అదే 'తలైవా' అని చెప్పారు. ఎంతో ఆశ్చర్యమేసింది. ఆయన అడిగిన సమయంలో నా వద్ద కాల్షీట్లు లేవు. సినిమా తెరకెక్కేందుకు కాస్త ఆలస్యమైనందున అదృష్టం కొద్దీ 'తలైవా'తో జోడీకట్టాను. వాస్తవానికి పెద్ద హీరోల సినిమాల్లో హీరోయిన్ బొమ్మలా వచ్చి వెళ్లాల్సిందే. అయితే 'తలైవా'లో ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇచ్చారు. చిత్రీకరణ సమయంలో నటుడు విజయ్‌ చాలా మంచి విషయాలు నేర్పారు. విజయ్‌తో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

అలాగే విజయ్ నుంచి చాలా నేర్చుకున్నానంటోంది అమలాపాల్. ఈ మలయాళ కుట్టి ప్రస్తుతం తమిళం, తెలుగు భాషలలో క్రేజీ హీరోయిన్‌గా ప్రకాశిస్తోంది. కోలీవుడ్‌లో విజయ్‌తో జతకట్టిన తలైవా చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. ప్రస్తుతం జయంరవికి జంటగా నిమిర్న్‌ందు నిల్ చిత్రంలో, ధనుష్ సరసన వేలై ఇల్లా పట్టాదారి చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా తెలుగులో, మలయాళంలో ఒక్కో చిత్రంలో చేస్తోంది. అమలాపాల్ మాట్లాడుతూ విజయ్ సరసన నటించాలన్న కోరిక తలైవా చిత్రంతో నెరవేరిందని తెలిపింది.

English summary
Amala said, "Everything happened very quickly in my life. There has been much appreciation and a lot of work coming my way. It's all been positive and I love the way my life has suddenly shaped up. I hope it sustains." Amala also said that initially she liked the script, the role of a dancer in it who will be an undercover police officer. And also she was very happy when she got to know that she will be paired opposite to Ilayathalapathy Vijay.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu