»   » డైరెక్టర్‌తో హీరోయిన్ అమలా పాల్ పెళ్లి డేట్ ఫిక్సయింది

డైరెక్టర్‌తో హీరోయిన్ అమలా పాల్ పెళ్లి డేట్ ఫిక్సయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అమలా పాల్, తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్‌తో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి ఎంగేజ్మెంట్ డేట్, పెళ్లి డేట్ కూడా ఫిక్సయింది. కోలీవుడ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం జూన్ 7న ఎంగేజ్మెంట్, జూన్ 12న వివాహా తేదీని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎంగేజ్మెంట్ కొచ్చిలో, వివాహం చెన్నైలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అమలా పాల్ కేరళకు చెందిన వ్యక్తి కావడంతో తమ స్వస్థలంలో ఎంగేజ్మెంట్ జరుపాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇక దర్శకుడు ఎ.ఎల్. విజయ్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. 2011లో ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం (తెలుగులో విక్రమ్ హీరోగా వచ్చిన 'నాన్న') షూటింగులో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

Amala Paul and Vijay marriage on June 12th

అమలా పాల్‌పై ప్రేమ పెంచుకున్న దర్శకుడు ఎఎల్ విజయ్....తమిళ హీరో విజయ్‌తో తీసిన 'తలైవా'(తెలుగులో 'అన్న') చిత్రంలో ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నాడు. గతంలో వీరి వ్యవహారంపై అనుమానం వచ్చిన చాలా మంది విషయాన్ని బయటకు లీక్ చేసారు. మీడియాలో కూడా ఇద్దరి మధ్య ప్రేమాయణం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో వారు ఈ విషయాన్ని అంగీకరించక పోగా, తమ మధ్య అలాంటిదేమీ లేదని బుకాయించే ప్రయత్నం చేసారు.

అమలా పాల్-ఎ.ఎల్. విజయ్ పెళ్లి విషయాన్ని అమలా పాల్ తల్లి అనీస్ పాల్ ఓ మేగగైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధృవీకరించారు. తన కూతురు అమలా పాల్ దర్శకుడు విజయ్‌తో ఎఫైర్ నడుపుతున్న విషయాన్ని తాను ఎలా తెలుసుకున్నాననే విషయాన్ని అనీస్ పాల్ సదరు మేగజైన్‌కు వివరించారు.

అమలా పాల్ ఫోన్ బిల్లు పరిశీలించిన అనీస్ పాల్ అందులో...ఎక్కువ కాల్స్ దర్శకుడు విజయ్‌తో మాట్లాడినట్లు ఉంది. అయితే విజయ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో అమలా పాల్ నటించడంతో తొలుతు ఆమెకు పెద్దగా అనుమానం రాలేదు. ఆ తర్వాత అమలా పాల్ వ్యవహారం పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందట. దర్శకుడు విజయ్‌తో ఎఫైర్ నడుపుతున్న విషయం ఇంట్లో తెలియడంతో తమను అమాలా కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిందని....ఆ తర్వాతా తాము ఒప్పుకోక తప్పలేదని అనీస్ పాల్ చెప్పుకొచ్చింది.

English summary
It is well-known that the marriage of actress Amala Paul with director A.L.Vijay is confirmed. According to a source, the engagement will be held onJune 7th in Cochin and marriage on June 12th in Chennai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu