»   » ఓపెనింగ్: అక్కినేని అమల వెంట సుమంత్ (ఫోటోలు)

ఓపెనింగ్: అక్కినేని అమల వెంట సుమంత్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ నటి, బ్లూక్రాస్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు అక్కినేని అమల హైదరాబాద్‌లోని మాదాపూర్‌ వద్ద కొత్తగా నెలకొల్పిన 'యునైటెడ్ హాస్పటల్స్'ను ప్రారంభించారు. అమలతో పాటు ఏఎన్ఆర్ మనవడు, హీరో సుంత్ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

యునైటెడ్ హాస్పటల్స్ వారు ప్రధానంగా డయాబెటిస్ సంబంధమైన వ్యాధులకు ప్రత్యేక చికిత్స అందించనున్నారు. హాస్పటల్ ప్రారంభోత్సవం సందర్భంగా డయాబెటిస్‌పై అవగాహన కల్పించే పలు సూచనలతో కూడిన బోర్డులను ఆసుపత్రిలో ఏర్పాటు చేసారు. డయాబెటిస్‌తో బాధ పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, దీని కారణం ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయని.....డయాబెటిస్ అరికట్టినపుడే ఇతర సమస్యలను అదుపులో ఉంచగలమని వక్తలు పేర్కొన్నారు.

యునైటెడ్ హాస్పటల్స్‌‌కు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను స్లైడ్ షోలో చూద్దాం.....

అమల, సుమంత్

అమల, సుమంత్

యునైటెడ్ హాస్పటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అక్కినేని అమల, హీరో సుమంత, డాక్టర్ మిత్ర పాల్గొన్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

డయాబెటిస్ పై అవగాహన

డయాబెటిస్ పై అవగాహన

యునైటెడ్ ఆసుపత్రి ప్రారంభోత్సవం అనంతరం డయాబెటిస్ వ్యాధిపై అవగాహన కల్పించే బోర్డును చూపిస్తూ.......ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని చెబుతున్న అమల

ఏర్పాట్లు ఎలా ఉన్నాయి

ఏర్పాట్లు ఎలా ఉన్నాయి

ఆసుపత్రిలో ఏర్పాట్లును పరిశీలిస్తున్న అమల. ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో ఏర్పాట్లపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసారు. చికిత్సకు ఉపయోగించే అత్యాధునిక పరికరాలను, సౌకర్యాలను ఆమె పర్యవేక్షించారు.

హీరో సుమంత్

హీరో సుమంత్

అమలతో పాటు సుమంత్ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం సుమంత్ ‘ఏమో గుర్రం ఎగరా వచ్చు' అనే చిత్రంలో నటిస్తున్నారు.

బ్యూటిఫుల్ స్మైల్

బ్యూటిఫుల్ స్మైల్

నాగార్జునతో పెళ్లికాక ముందు సినిమాల్లో నటించిన అమల...అప్పట్లో తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికీ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేని స్పష్టం అవుతోంది. ఆమె స్మైల్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది కదూ...

English summary
Smt.Akkineni Amala launches United Hospitals at Madhapur, Hyderabad. Actor Sumanth also Participated in this Event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu