twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పుష్ప ఓటీటీ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ.. ఊహించని విధంగా రిలీజ్.. ఎప్పుడంటే?

    |

    అల్లు అర్జున్‌ సుకుమార్‌ కాంబోలో రూపొందిన పుష్ప సినిమా మీద అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శుక్రవారం విడుదలై హిట్ టాక్ ని అందుకొని ముందుకు దూసుకెళ్తుంది. ఎక్కడ విన్నా.. ఎక్కడ చూసినా పుష్ప మాటలే వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే

     భారీ అంచనాలు

    భారీ అంచనాలు

    టాలీవుడ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. బన్నీ స్టైల్‌‌కి, డాన్స్‌‌కు అభిమానులు నీరాజనాలు పడుతుంటారు.. ఇక వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆయన ప్రస్తుతం టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేసిన విషయం తెలిసిందే. రంగస్థలం లాంటి భారీ విజయం తర్వాత సుకుమార్ సినిమా ఇది.. అలాగే అలవైకుఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బన్నీ చేసిన సినిమా కావడంతో ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

     అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో

    అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో

    అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించగా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, సునీల్ విలన్‌స్గా నటించారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించారు. అనసూయ, అజయ్ ఘోష్ వంటి వారు కీలక పాత్రలు చేశారు.

    భారీ బిజినెస్

    భారీ బిజినెస్

    తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దాన్ని 'పుష్ప ద రైజ్' పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. భారీ అంచనాలతో 'పుష్ప' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాం రూ. 36 కోట్లు, సీడెడ్‌లో రూ. 18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.25 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 8 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 7 కోట్లు, గుంటూరు రూ. 9 కోట్లు, కృష్ణాలో రూ. 7.50 కోట్లు, నెల్లూరు రూ. 4 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 101.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

    గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో

    గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో

    సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది. విభిన్నమైన కథతో ఈ సినిమా రూపొందగా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మునుపెన్నడూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో కనిపించాడు. అయితే ఈమద్య కాలంలో సినిమాలు అన్ని కూడా నాలుగు వారాల్లోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

    Recommended Video

    Latest Film Updates : Venkatesh Drushyam 2 కూడా OTT లోనే..! || Filmibeat Telugu
     ఓటీటీ లో ఎప్పుడు?

    ఓటీటీ లో ఎప్పుడు?

    ఈ క్రమంలో పుష్ప కూడా ఓటీటీ లో ఎప్పుడు వస్తుంది అనే చర్చ అప్పుడే మొదలు అయ్యింది. భారీ ఎత్తున అంచనాలున్న పుష్ప సినిమా ను ప్రముఖ ఓటీటీ అమెజాన్ వారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్ లో ఈ సినిమాను 40-50 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే సినిమాకు వసూళ్లు మూడవ వారం నుంచి తగ్గితే అప్పుడు నాలుగు వారాలు పూర్తి అయిన వెంటనే స్ట్రీమింగ్‌ చేసుకునే వెసులు బాటును కూడా అమెజాన్ కు ఇచ్చారని అంటున్నారు. సంక్రాంతి కి ఎలాగో కొత్త సినిమాల అరంగ్రేటంతో కలెక్షన్స్ వీక్ అవుతాయి కనుక పుష్ప ను సంక్రాంతికి ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజానిజాలు ఈ మేరకు ఉన్నాయనేది తెలియాల్సి ఉంది.

    English summary
    Amazon Prime Video Bagged Pushpa Digital Rights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X