For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవి ‘సైరా... నరసింహా రెడ్డి’ కి అమేజాన్ భారీ ఆఫర్

  By Bojja Kumar
  |

  మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయబోతున్న చిత్రం 'సై రా... నరసింహా రెడ్డి'. తెలుగులో 'బాహుబలి' తర్వాత ఆ స్థాయిలో వచ్చే సినిమా ఇదే కాబోతోంది. ఈ చిత్రాన్ని కేవలం తెలుగుకే పరిమితంచేయకుండా హిందీ, తమిళంలో ఒకేసారి తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

  Ram Charan Intresting Comments in "SYE RAA" First Look Release Event

  ఈ సినిమా కోసం భారీ తారాగణంతో పాటు, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాకు హిందీలో భారీ క్రేజ్ తెచ్చేందుకు బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్‌ను ఇందులో నటించేందుకు ఒప్పించారు.

  అమేజాన్ నుండి భారీ ఆఫర్

  అమేజాన్ నుండి భారీ ఆఫర్

  ‘సై రా...' చిత్రానికి అమేజాన్ నుండి భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ‘ప్రైమ్ వీడియో' పేరుతో ఆయన్ లైన్ మూవీ స్ట్రీమింగ్ వెబ్ సైట్ రన్ చేస్తున్న అమేజాన్ ‘సై రా..' డిజిటల్ రైట్స్ దక్కించుకునేందుకు భారీగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

  సినిమా బడ్జెట్‌లో 20 శాతం వెచ్చించేందుకు రెడీ

  సినిమా బడ్జెట్‌లో 20 శాతం వెచ్చించేందుకు రెడీ

  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘సై రా...' బడ్జెట్‌లో 20 శాతం వెచ్చించి సినిమా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసేందుకు అమేజాన్ ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నిర్మాత రామ్ చరణ్‌ను చిత్ర నిర్మాతలు కలిసినట్లు తెలుస్తోంది.

  ఇంకా ఏ నిర్ణయం తీసుకోని రామ్ చరణ్

  ఇంకా ఏ నిర్ణయం తీసుకోని రామ్ చరణ్

  అయితే ఈ డీల్ విషయంలో రామ్ చరణ్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. డీల్ ఓకే అయితే నిర్మాతగా రామ్ చరణ్ కు మంచి ప్రాఫిట్ వస్తుందని అంటున్నారు.

  షూటింగుకు ముందే పలు మార్పులు

  షూటింగుకు ముందే పలు మార్పులు

  ఈ చారిత్రక చిత్రం నుంచి సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ తప్పుకున్నారు. ఇతర కమిట్‌మెంట్స్‌తో డేట్స్ అడ్జస్ట్ చేయలేక పోవడమే కారణం. ఆయన స్థానంలో రత్నవేలును సినిమాటోగ్రాఫర్‌గా ఎంపిక చేశారు.

  రెహమాన్ గురించి పుకారే

  రెహమాన్ గురించి పుకారే

  'సై రా' సినిమా నుండి మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ తప్పుకుంటున్నాడంటూ పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది కేవలం పుకారే అని, ఇందులో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ చెబుతోంది.

  షెహన్ షా ఆఫ్ ఇండియన్ సినిమా అమితాబ్

  షెహన్ షా ఆఫ్ ఇండియన్ సినిమా అమితాబ్


  షెహన్ షా ఆఫ్ ఇండియన్ సినిమా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ‘సైరా నరసింహారెడ్డి' చిత్రంలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. అయితే ఆయన ఏ పాత్రలో నటించబోతున్నారు అనేది త్వరలో ప్రకటించనున్నారు.

  డేరింగ్ స్టార్ జగపతి బాబు

  డేరింగ్ స్టార్ జగపతి బాబు

  డేరింగ్ స్టార్ జగపతి బాబు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆ పాత్ర వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్ర తెలిపింది.

  కిచ్చా సుదీప్

  కిచ్చా సుదీప్


  కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూడా ఈ చిత్రంలో మెయిన్ రోల్ చేయబోతున్నారు. బాహుబలి సినిమాలోనూ కిచ్చా సుదీప్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సుదీప్ ద్వారా కన్నడ మార్కెట్ వశం చేసుకోవచ్చే ఉద్దేశ్యం కనిపిస్తోంది.

  క్వీన్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్ నయనతార

  క్వీన్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్ నయనతార

  క్వీన్ ఆఫ్ ఆఫ్ సౌతిండియా సిల్వర్ స్క్రీన్ నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ఈవిడ నటించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

  మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి

  మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి

  తమిళ స్టార్ విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. విజయ్ సేతుపతి ద్వారా తమిళ మార్కెట్ లో మంచి వసూళ్లు సాధించవచ్చని దర్శక నిర్మాతల ప్రయత్నంగా కనిపిస్తోంది.

  రాజీవన్

  రాజీవన్

  ప్రొడక్షన్ డిజైనర్‌గా రాజీవన్ పని చేస్తున్నారు. గతంలో రాజీవన్ పలు అద్భుతమైన సినిమాలకు ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేశారు.

  పరుచూరి బ్రదర్స్

  పరుచూరి బ్రదర్స్

  సై రా నరసింహారెడ్డి చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచయితలు. మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, రచనా సహకారం: సత్యానంద్‌.

  ప్రొడ్యూసర్

  ప్రొడ్యూసర్

  ఈ చిత్రానికి మెగాస్టార్ తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  సురేందర్ రెడ్డి

  సురేందర్ రెడ్డి

  ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సురేందర్ రెడ్డి కెరీర్లోనే ఇదే అతి పెద్ద ప్రాజెక్ట్. ఆయన ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నారు.

  English summary
  Megastar Chiranjeevi is getting ready to shoot for the historical film 'Sye Raa Narasimha Reddy'. Pre-production of the film is taking more time as producer Charan and director Surender Reddy are taking all the precautions to make it a pan-India film in the footsteps of 'Baahubali' series. Top video streaming company Amazon Prime sand to have approached Sye Raa producers with a huge offer to bag the digital content which includes making videos motion posters, teasers, trailers etc.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X