twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆయనే నా పొలిటికల్ గురు: ఫ్యాన్స్‌కు హీరోయిన్ క్షమాపణ!

    By Bojja Kumar
    |

    బెంగుళూరు: కన్నడ హీరోయిన్, మాండ్యా లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీ రమ్య....నటుడు, రాజకీయ నాయకుడైన అంబరీష్ అభిమానులకు క్షమాపణ చెప్పింది. ఇటీవల రమ్య, అంబరీష్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసిందనే విమర్శలు వెలువడ్డాయి. ఆమె తండ్రి వల్లే అంబరీష్‌ను రాజకీయాల్లోకి వచ్చారని రమ్య వ్యాఖ్యానించినట్లు వార్తలు వెలువడ్డాయి.

    ఈ నేపథ్యంలో అంబరీష్ అభిమానులతో పాటు, ఇతర కాంగ్రెస్ పార్టీ వర్గాల నుండి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రమ్య వివరణ ఇచ్చుకోక తప్పలేదు. తాను అంబరీష్ గురించి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, అంబరీష్ తన రాజకీయ గురువు అని రమ్య వివరణ ఇచ్చారు.

    Ambareesh Is My Political Guru: Ramya

    అంబరీష్ గారు తొలుత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినపుడు జడి(ఎస్) పార్టీలో ఉన్నారని....ఆ పార్టీ నుండి అంబరీష్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి తన తండ్రితో పాటు ఎస్ఎం కృష్ణ కృషి చేసారని తాను వ్యాఖ్యానించానని, తన తండ్రి వల్లే అంబరీష్ రాజకీయాల్లోకి వచ్చారని తాను వ్యాఖ్యానించలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని రమ్య తెలిపారు.

    ఏది ఏమైనా తన వ్యాఖ్యలు అభిమానుల మనసు గాయపరిచి ఉంటే క్షమించాలని రమ్య పేర్కొన్నారు. తన రాజకీయ గురువు అంబరేష్ మాత్రమే అని ఆమె స్పష్టం చేసారు. ఇటీవల మాండ్యా పార్లమెంటు ఉప ఎన్నికలో గెలుపొందిన రమ్య, రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే స్థానం నుండి పోటీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

    English summary
    Sandalwood Queen Ramya, who was in news in Gandhinagara and political circles for passing remarks about Ambareesh's political entry, has finally apologised to his fans. The actress, who says Ambareesh is her political guru, had won over Congress ticket from Mandya Lok Sabha constituency.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X