For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్, ఎన్టీఆర్, మహేష్ లతో చేసింది, ఇలాంటి ఫొటోలతో పరువు పొగోట్టుకుంటోంది

  By Srikanya
  |

  ముంబై: వయస్సుకు తగ్గట్లు హుందాగా ఉంటేనే ఎవరైనా మెచ్చుకుంటారు. గౌరవంగా చూస్తారు. కానీ కొందరు సెలబ్రెటీలకు వయస్సు పెరుగుతుంటే మానసిక వయస్సు తగ్గుతుందనుకుంటాను. వారు చేసే పిచ్చి ఛేష్టలు జనాలకు విరక్తి కొట్టిస్తూంటాయి. అయితే గతంలో సెలబ్రెటీలు ఎలాంటి వేషాలు వేసినా స్పందించే అవకాసం సామాన్యులకు ఉండేది కాదు.

  కానీ రోజులు మారాయి.టెక్నాలజి విస్త్రృతితో సోషల్ మీడియాలో ఏ సెలబ్రెటినైనా దుమ్ము దులుపుతున్నారు. తేడా వచ్చిందా ట్రోల్ చేసి తాట తీస్తున్నారు. అందుకు చిన్నా పెద్దా తేడాలేదు. ఆడా మగా అనే ఆలోచన అసలు లేనే లేదు. దాంతో సినీ సెలబ్రెటీలు కాస్తంత గౌరవంగా బిహేవ్ చేస్తున్నారు. అయితే అమీషాపటేల్ వంటి అతి బ్యాచ్ మాత్రం ఇదిగో ఈ క్రింద చూపిన విధంగా రెచ్చిపోయి..అందరి విమర్శలకు గురి అవుతున్నారు. సిగ్గుతో తల దించుకోవాల్సిన స్దితి తెచ్చుకుంటున్నారు.

  గత కొంత కాలంగా అమీషా పటేల్...సినిమాలకు , మీడియాకు దూరంగా ఉంటోంది. అయితే రీసెంట్ గా మళ్లీ ఏమి పూనిందోకానీ అమీషా పటేల్...సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. దానికి తోడు ఆమె బయ్యాజీ సూపర్ హిట్ అనే హిట్ చిత్రంలో చేసింది. ఆ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవటంతో ఇక ఆమె దూకుడుకు అంతేలేదు.

   నవ్వుకుంటున్నారు

  నవ్వుకుంటున్నారు

  రీసెంట్ గా ఆమె ఇదిగో ఈ క్రింద ఫొటోని పోస్ట్ చేసింది. ఈ హాట్ అవతారంలో స్నానం చేస్తూ , బ్లాక్ డ్రస్ వేసుకుని ఇచ్చిన స్టిల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే పాజిటివ్ గా మాత్రం కాదు. ఈ స్టిల్ ని చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఈ వయస్సులో ఈ వేషాలేంటి అని ముక్కున వేలువేసుకుంటున్నారు.

   చూడలేకపోతున్నాం తల్లో...

  చూడలేకపోతున్నాం తల్లో...

  దాంతో అమీషాని అల్లరి పెడ్తూ రకరకాల ట్వీట్ల వర్షం కురిసింది. ఇన్నాళ్లూ తనకు ఇంత పాన్ ఫాలోయింగ్ ఉంది అని ఆనందపడిపోయిన అమీషా..ఈ ట్వీట్ల దాడితో ఒక్కసారి షాక్ కు గురైంది. తను పెట్టిన పోస్ట్ కు ఇలాంటి నెగిటివ్ రెస్పాన్స్ వస్తుందని అసలుఊహించలేదట. ముసలామెకు దసరాపండగ అన్నట్లుగా ఆమెను ఆడిపోసుకుంటున్నారట. అప్పటికీ ఆమె కొన్ని ట్వీట్స్ తొలిగించింది.

  రాక్ స్టార్..ఇంకోటా

  రాక్ స్టార్..ఇంకోటా

  ఈ ఫొటోని ఆమె పోస్ట్ చేస్తూ...ఇనిస్ట్రగ్రామ్ లో షవర్ లైక్ ఎ రాక్ స్టార్ అని పెట్టింది. ఇది చూసినవాళ్లు ఆమెను పూనం పాండేతో పోలుస్తున్నారు. అంటే సీ గ్రేడ్ ఆర్టిస్ట్ తో పోల్చటం ఆమె అబిమానులకు నచ్చటం లేదు. వారు ఇలాంటివి అమీషా పెట్టకుండా ఉంటే బాగుండును అని కోరుకుంటున్నారు. అయితే అమీషా ఆగుతుందా...

   జాబ్ లెస్ ఉన్నప్పుడు

  జాబ్ లెస్ ఉన్నప్పుడు

  ఈ ఫొటోని కొందరు ట్రోల్ చేస్తూ..నేను ఏ పనిలేనప్పుడు ఇలా అని పెట్టినా బాగుండేది అని వెటకారం చేస్తున్నారు. ఖాళీగా ఉండి ఏం తోచక ఇలాంటి ఫొటోలు పెడుతోందని వారు విమర్శిస్తూ...నవ్వులు పాలవటం తప్ప వీటి వలన ఒరిగేది లేదంటున్నారు. నిజమే కదా ఈ ఫొటో చూస్తూంటే కాస్త ఇబ్బందిగానే ఉంది కదా..

   నో సక్సెస్

  నో సక్సెస్

  అమీషా పటేల్ తెలుగులో పవన్ సరసన బద్రి, మహేష్ బాబు సరసన నాని చిత్రాలు చేసిన హీరోయిన్ . ....గుర్తుందా. ఆమె హిందీలో హృతిక్ రోషన్ తో 2000 లో ‘కహో నా ప్యార్‌ హై' చిత్రంతో పరిచయమైంది. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా విజయం సాధించింది. ‘కహో నా ప్యార్‌ హై'తో హీరోయిన్‌గా కెరీర్‌ ఆరంభించినప్పుడు అమీషా పటేల్‌ కెరీర్‌కు ఢోకా ఉండదనీ, తదుపరి సూపర్‌ హీరోయిన్‌ ఆమే అవుతుందనీ చాలామంది భావించారు. కానీ అదేమీ జరగలేదు

   వయస్సుతో పనేంటి

  వయస్సుతో పనేంటి

  బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ ఇప్పుడంటే సినిమాల్లో కనిపించడం తగ్గించేసింది కానీ.. కొన్నేళ్ల క్రితం వరకూ ఫీల్డ్ లోనూ , బయిట బాగానే రచ్చ చేసేసింది. ఇప్పుడు ఒకటీ అరా మాత్రమే ఆఫర్స్ చేతిలో ఉన్నా.. అమ్మడిలో జోరు కానీ స్పీడ్ కానీ ఏ మాత్రం తగ్గలేదు. ఎలాగోలా తన ఐడింటెటీను కనపడేలా ప్రదర్శన చేస్తోంది. ఇలాంటి ఫొటోలతో ఎట్రాక్ట్ చేస్తోంది.

   ఇప్పటికీ అదే అందం

  ఇప్పటికీ అదే అందం

  తొలి చిత్రం కహోనా ప్యార్ హైలో హృతిక్ రోషన్ తో కనిపించినట్లే.. పవన్ పక్కన బద్రిలో ఉన్నట్లే.. 40 ఏళ్లు దాటినా అదే మెరుపు, యవ్వనంతో ఇప్పటికీ మెరిసిపోతూ ఉంటుంది. యంగ్ ఏజ్ లో కనిపించినట్లుగానే కాదు.. చూపించినట్లుగా ఇప్పుడు కూడా ఉండగలగడం అమీషా అసలైన ప్రత్యేకత అంటారు ఆమె అబిమానులు. అదంతా ఆమె మేకప్ మహిమ అంటారు విమర్శకులు.

   చనువు తీసుకుంటే చంపేసినంత..

  చనువు తీసుకుంటే చంపేసినంత..

  ఆ మధ్యన ఓ మీడియా వ్యక్తి ఆమెను సంభోదిస్తూ..అమీషా.. గత కొంతకాలంగా ఎందుకు సినిమాల్లో నటించడం లేదని ఓ విలేకరి అడుగగా.. 'నన్ను అమీషా అని కాదు.. అమీషాజీ అని పిలువండి' అంటూ అరిచేసిందట . దాంతో మీడియావారు ఖంగుతిన్నారట. ఇంతకాలం నుంచి ఉన్న పరిచయం తో ఇలా కాస్త చనువు తీసుకుంటే ఇలా అనేసిందేంటి అని విలవిల్లాడిపోయారట.

   రాఖీ సావంత్ లాగ చీప్ గా

  రాఖీ సావంత్ లాగ చీప్ గా

  ఒకప్పుడు బాలీవుడ్ ప్రిన్సెస్ అనిపించుకున్న హీరోయిన్ కాస్త ఆఫర్స్ తగ్గి వెనకబడేసరికి..ఇప్పుడు మాత్రం చీప్ గా రాఖీ సావంతా లా బిహేవ్ చేస్తోందే అని అంతా వాపోతున్నారు. సినిమా కెరియర్ ఫెయిల్ అవ్వడంతో ఈ ఫారిన్ యునివర్సిటీ ఎకనామిక్స్ గోల్డ్ మెడలిస్ట్ ఇలా తయారైంది అని నవ్వుతున్నారు.

   సీక్వెలేనా..,,ఇంకేమన్నా కావాలా పాపా

  సీక్వెలేనా..,,ఇంకేమన్నా కావాలా పాపా

  'నన్ను ఇప్పటికీ చాలామంది కహోనా ప్యార్ హై సీక్వెల్ ఎప్పుడూ అని అడుగుతున్నారు. నాతోపాటు హృతిక్ రోషన్ రాకేష్ రోషన్ లను కూడా ట్యాగ్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా సీక్వెల్ తీస్తారని అశిస్తున్నాను. ప్రేక్షకులు మా జంటను మళ్లీ చూడాలని తహతహలాడుతున్నారు'' అంటూ కామెంట్ చేసింది అమీషా. ఇది విన్న వారంతా షాక్ అవుతున్నారు. సీక్వెల్ యేనా ఇంకేమన్నా కావాలా అని వెటకారం చేస్తున్నారు.

   ఎందుకిలా చెత్త కామెంట్స్

  ఎందుకిలా చెత్త కామెంట్స్

  రీసెంట్ గా అమీషా మరో చెత్త కామెంట్ చేసి అందరి చేతా చీ కొట్టించుకుంది'' కహోనా ప్యార్ హై సినిమాలో నేనూ-హృతిక్ క్లిక్ అయినట్లు.. అస్తమానం కొత్త హీరోయిన్లు అతగాడి ప్రక్కన క్లిక్కవ్వరు. మొహంజొదారో సినిమా చూసుకోండి.. ఏమైంది?'' అంటూ హీరోయిన్ పూజా హెగ్డేను టార్గెట్ చేసింది.

   ఇదో వివాదం

  ఇదో వివాదం

  అమీషా కు ఏలాగో వేషాలు లేవు, వివాదాలు ఉన్నా చాలనుకుంటోందో ఏమో.. ఆ మధ్యన జాతీయ గీతాన్ని అవమానించింది. అమీషా ముంబై జుహూ ప్రాంతంలోని ఓ థియేటర్ కి వెళ్లింది. అక్కడ సినిమా థియేటర్లో షో ప్రారంభానికి ముందు జాతీయ గీతం వినిపించినప్పుడు అదేమీ పట్టించుకోకుండా తీరిగ్గా కూచుని సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటోంది. జాతీయ గీతాన్ని అవమానించేలా ప్రవర్తించింది. ఆ విషయం బయిటకు వచ్చేసి అల్లరైంది.

   ఇగో తగ్గాలమ్మా...

  ఇగో తగ్గాలమ్మా...

  తొలి నుంచీ...బాలీవుడ్‌లో కూడా అమీషా పరిస్థితి అంతంత మాత్రమే. దీనికి ఆమె ఆటిట్యూడే కారణమట. సినిమాల్లో హీరోయిన్‌గా నటించేటపుడు చాలా ఇగోయిస్ట్‌గా ఉండేదట. అప్పుడే కాదు.. ఇప్పుడు 41 ఏళ్ల వయసులోనూ ఆమె ఇగో ఏమాత్రమూ తగ్గలేదనడానికి పైన చెప్పుకున్న ఉదంతాలే ఉదాహరణ.

   ఫ్యాన్సే బ్రతికిస్తున్నారు

  ఫ్యాన్సే బ్రతికిస్తున్నారు

  చాలా కాలంగా అమీషా కెరీర్‌ అప్స్‌ అండ్‌ డౌన్స్‌ తో నడుస్తోంది. ‘గదర్‌: ఏక్‌ ప్రేమ్‌కథ'లో సకీనా పాత్రలోనూ, ‘మంగళ్‌పాండే: ద రైజింగ్‌'లో వితంతువు జ్వాల పాత్రలోనూ ఆమె నటనను తీరును మరచిపోలేరు. వారందికీ ధాంక్స్ చెప్తోంది. తనకు ఆఫర్స్ రాకపోయినా, తన ఫ్యాన్స్ అండదండలున్నందుకు ఆనందంగా ఉంది అంటోంది అమీషా.

   నేను అలా బ్రతకాలనుకోలేదు

  నేను అలా బ్రతకాలనుకోలేదు

  అమీషా పటేల్ మాట్లాడుతూ.... ఏదో ఓ మామూలు అమ్మా యిలా జీవితం గడపాలని నేనెప్పుడూ అనుకోలేదు. నిరంతరం సవాళ్లను ఎంజాయ్‌ చేస్తూనే వచ్చాను. ధైర్యంతో నేనే పని చేసినా, అది నాకు మం చి ఫలితాన్నే ఇచ్చింది. సినిమాలో నా కెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాను అంది.

   గాఢ్ ఫాదర్ లేరు

  గాఢ్ ఫాదర్ లేరు

  హిందీ సినిమా ఇండస్ట్రీకీ, మా కుటుంబానికీ ఎలాంటి అనుబంధం లేకపోవడంతో మొదట్లో సత్యదేవ్‌ దూబే నాటక సమాజంలో చేరడానికి మా అమ్మానాన్నల్ని ఒప్పించడం తలకు మించిన పనయ్యింది అంటూ అమీషా తన తొలి రోజులును గుర్తు చేసుకుని నిట్టూరుస్తోంది. అయితే తనలాంటి అమ్మాయికు ఇంతకు మించిన సక్సెస్ రావాల్సి ఉందని చెప్పుకొచ్చింది.

   గోల్డ్ మెడల్ సాధించా

  గోల్డ్ మెడల్ సాధించా

  ఎకనామిక్స్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించిన నాకు, కావాలనుకుంటే అందులో మంచి కెరీరే లభించి ఉండేది. లక్కీగా రాకేశ్‌ రోషన్‌గారు మా నాన్నకు స్కూల్‌మేట్‌ కావడం నాకు కలిసొచ్చింది. రాకేశ్‌గారు నాకు ‘కహో నా ప్యార్‌ హై' సినిమా ఆఫర్‌ చేయడంతో, మా అమ్మానాన్నలు సరేనన్నారు. అలా అందులో నా పాత్రను బాగా ఎంజాయ్‌ చేశా. జనం కూడా నన్ను బాగా ఆదరించారు అంది అమీషా.

   కష్టమైన వ్యవహారం

  కష్టమైన వ్యవహారం

  అయితే అమ్మానాన్నలకు దాని తర్వాత నేను సినిమాల్లో కొనసాగడం ఇష్టంలేదు. కానీ నేను ‘గదర్‌' స్క్రీన్ టెస్ట్‌కు వెళ్లా. అప్పట్నించీ నా కెరీర్‌ను ఆస్వాదిస్తూనే ఉన్నా.కొత్తగా వచ్చినవాళ్లకైనా, అప్పటికే కొన్ని సినిమాలు చేసినవాళ్లకైనా, ఎవరికైనా సరే సినిమాల్లో కొనసాగడమనేది కష్టసాధ్యమైన వ్యవహారం.

   ఇదవరకటి కంటే ఇప్పుడే హాట్ గా

  ఇదవరకటి కంటే ఇప్పుడే హాట్ గా

  నేను తిండిని ఇష్టపడతాను. అయితే నేను తీసుకునేదానిలో ఎక్కువగా ఉండేవి ఆరోగ్యకరమైన పదార్థాలే. నేను వర్కవుట్స్‌ చేస్తాను. అలాగని గంటల తరబడి జిమ్‌లో గడిపే రకాన్ని కాదు. మహా అయితే 40 నిమిషాలు గడుపుతాను. ఇదివరకటి కంటే ఇప్పుడు మరింత హాట్‌గా కనిపిస్తున్నానంటే, దానికి కారణం జీన్స్‌ అని నా నమ్మకం అంటోంది అమీషా.

  English summary
  వయస్సుకు తగ్గట్లు హుందాగా ఉంటేనే ఎవరైనా మెచ్చుకుంటారు. గౌరవంగా చూస్తారు. కానీ కొందరు సెలబ్రెటీలకు వయస్సు పెరుగుతుంటే మానసిక వయస్సు తగ్గుతుందనుకుంటాను. వారు చేసే పిచ్చి ఛేష్టలు జనాలకు విరక్తి కొట్టిస్తూంటాయి. అయితే గతంలో సెలబ్రెటీలు ఎలాంటి వేషాలు వేసినా స్పందించే అవకాసం సామాన్యులకు ఉండేది కాదు.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X