»   » తుపాకీ తూటాల పేలుళ్ళ మధ్య...

తుపాకీ తూటాల పేలుళ్ళ మధ్య...

Posted By:
Subscribe to Filmibeat Telugu

గ‌తంలో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించిన అనురాధ ఫిలింస్ డివిజ‌న్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం రోజ్ గార్డెన్‌. ప్ర‌స్తుతం ఈ చిత్రంతో కాశ్మీర్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. చ‌ద‌ల‌వాడ తిరుప‌తిరావు స‌మ‌ర్ప‌ణ‌లో చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య యుద్ద వాతావ‌ర‌ణం క‌లిగి ఉంది. కాశ్మీర్‌లో అడుగుపెట్ట‌డానికే భ‌యం నెల‌కొన్న స‌మ‌యంలో ధైర్యంగా, సాహ‌సంగా ఈ చిత్రం పూర్తిగా కాశ్మీర్‌లోనే చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోవ‌టం విశేషం.

దర్శ‌కుడు జి.ర‌వికుమార్‌(బాంబే ర‌వి) మాట్లాడుతూ... కాశ్మీర్ మొత్తం అల్ల‌క‌ల్లోలంగా ఉన్న స‌మ‌యంలో నిర్మాత చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు మాత్ర‌మే సాహ‌సంతో ఈ చిత్రాన్ని కాశ్మీర్‌లో నిర్మిస్తుండ‌టం విశేషం. అలాగే కాశ్మీర్ ప్ర‌భుత్వంతో నిర్మాత‌ల‌కు ఉన్న అనుబంధం కార‌ణంతో దాదాపు 120 మంది యూనిట్ స‌భ్యుల‌తో షూటింగ్ చేస్తున్నాం. కాశ్మీర్ ప్ర‌భుత్వం స‌హ‌కారంతో ప్ర‌భుత్వం అందిస్తున్న‌ భారీ భ‌ద్ర‌త మ‌ధ్య స‌హకారంతో ఏ టెన్ష‌న్ లేకుండా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఈ చిత్రీక‌ర‌ణ‌లో సైన్యానికి చెందిన ఆయుధాల‌నే ఉప‌యోగిస్తున్నట్టు చెప్పారు.

English summary
With tourists and Bollywood going away from Valley due to ongoing violent unrest, the Tollywood still prefers Kashmir with an upcoming movie ‘Rose Garden’ being shot in scenic Valley.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu