»   » కాంగ్రెస్ పార్టీకి జై కొడుతున్న పవన్ హీరోయిన్!

కాంగ్రెస్ పార్టీకి జై కొడుతున్న పవన్ హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

షిమ్లా: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'బద్రి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరియమైన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్. తాజాగా ఈ భామ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోంది. హీమీర్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న రాజిందర్ సింగ్ రాణా తరుపున ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

బిజేపీ పార్టీ రెండు సార్లు విజయం సాధించిన ఈ నియోజకవర్గం నుండి తొలిసారిగా పోటీ చేస్తున్నారు రాజిందర్ సింగ్ రాణా. దీంతో అతన్ని గెలిపించేందుకు తన చేతనైన సాయం చేస్తోంది అమీషా పటేల్. తదనైన రీతిలో ప్రత్యర్థి పార్టీలపై విమర్శల వర్షం కురిపిస్తూ ఆకట్టుకుంటోంది అమీషా పటేల్.

Amisha Patel campaigns for Congress

2000 సంవత్సరంలో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన 'కహోనా ప్యార్ హై' చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన అమీషా పటేల్ ఆ చిత్రం విజయంతో లైమ్ లైట్ లోకి వచ్చింది. అయితే తర్వాత ఆమె నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం పరాజయం పాలవ్వడంతో అమీషాకు స్టార్ హీరోయిన్ హోదా దక్కలేదు. మెయిన్ హీరోయిన్‌గా అమీషా కెరీర్ ఎప్పుడో ముగిసింది.

ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాల్లో గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్, ఇతర క్రింది స్థాయి పాత్రలు చేస్తూ నెట్టుకొస్తోంది అమీషా. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో రన్ బోలా రన్, భయ్యాజీ సూపర్ హిట్, దేశి మ్యాజిక్ తదితర చిత్రాల్లో నటిస్తోంది. 37 ఏళ్ల అమీషా పటేల్ ఇప్పటికీ పెళ్లి చేసుకుండానే ఒంటరి జీవితం సాగిస్తోంది.

English summary
Campaigning for Congress candidate Rajinder Rana for the Hamirpur Lok Sabha seat, the BJP's pocket borough, Amisha Patel said: "Thakur is often seen in Mumbai, Dubai and South Africa and is well aware of the names of film stars."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu