నీ కోపం, ఆగ్రహం నచ్చింది.. కంగ్రాట్స్..
రయీస్ చిత్రంలో యాంగ్రీ యంగ్ మ్యాన్ కనిపించిన షారుక్ ఖాన్ పై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు.
రయీస్ చిత్రంలో యాంగ్రీ యంగ్ మ్యాన్ కనిపించిన షారుక్ ఖాన్ పై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు. 'రయీస్‌లో నీ ఆగ్రహం, కోపం నాకు నచ్చింది'అంటూ బిగ్ బీ ట్వీట్ చేశారు. అద్భుతమైన నటన కనబరిచిన బాలీవుడ్ బాద్‌షాకు ట్వీటర్‌లో అభినందనలు తెలిపారు. 80 దశకం నాటి కథాంశంతో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొంటున్నది.

ఈ నేపథ్యంలో అమితాబ్ ట్వీట్టర్‌లో స్పందించారు. 80వ దశకంలో దీవార్, జంజీర్ చిత్రాల్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా కనిపించిన అమితాబ్ కు ప్రేక్షకులు నీరాజనం పట్టిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











