»   » మెగాస్టార్ కోసం పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా.. రోల్స్ రాయిస్ కారు, రాచ మర్యాదలు!

మెగాస్టార్ కోసం పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా.. రోల్స్ రాయిస్ కారు, రాచ మర్యాదలు!

Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ ఎక్కడకి వెళ్లినా ఘనస్వాగతాలు, అతిథి మర్యాదలు లభిస్తాయి. అమితాబ్ బచ్చన్ సైరా చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. అమితాబ్ షూటింగ్ లో పాల్గొన్నన్ని రోజులు ఈ బాలీవుడ్ మెగాస్టార్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరు అద్భుతమైన ఆతిధ్యం అందించినట్లు తెలుస్తోంది. అమితాబ్ హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు చిరు తన రోల్స్ రాయిస్ కారుని బిగ్ బికి ఇచ్చారట.అమితాబ్ సెక్యూరిటీ విషయంలో కూడా చిరు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ సైరా నరసింహా రెడ్డి చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Amitabh Bachchan To Schedule For Saira Movie
సైరా కోసం బిగ్ బి

సైరా కోసం బిగ్ బి

అమితాబ్ బచ్చన్ సైరా చిత్ర షూటింగ్ కోసం ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. సైరా చిత్రంలో అమితాబ్ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రని సైరా నరసింహారెడ్డి గా చిత్రీకరిస్తున్నారు.

భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా

భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా

సైరా నరసింహా రెడ్డి చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. 150 కోట్ల భారీ బడ్జెట్ తో మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం.

రోల్స్ రాయిస్ కారు ఇచ్చేసారు

రోల్స్ రాయిస్ కారు ఇచ్చేసారు

సైరా చిత్ర షూటింగ్ కోసం అమితాబ్ హైదరాబాద్ లో కొన్ని రోజులు బస చేసారు. ఆ సమయంలో చిరంజీవి తన రోల్స్ రాయిస్ కారుని అమితాబ్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. అమితాబ్ హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు ఆ కారుని ఆయన వెంటే ఉంచినట్లు తెలుస్తోంది. అమితాబ్ బసచేసిన హోటల్ నుంచి షూటింగ్ లొకేషనల్ వరకు ఆ కారులోనే ప్రయాణించారట.

భారీ భద్రత

భారీ భద్రత

అమితాబ్ సెక్యూరిటీ విషయంలో కూడా చిరంజీవి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారట. అమితాబ్బస చేసిన హోటల్ ముందు భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అమితాబ్ కు ప్రత్యేకంగా సెక్యూరిటీ కల్పించింది.

పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా

పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా

పవన్ కళ్యాణ్ అమితాబ్ బచ్చన్ ని ఆయన బస చేసిన హోటల్ లో సతీ సమేతంగా కలుసుకునట్లు సమాచారం. గురువారం రోజు పవన్ కళ్యాణ్ అమితాబ్ ని కలుసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అమితాబ్ రోల్ అదేనా

అమితాబ్ రోల్ అదేనా

అమితాబ్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఇటీవల సైరా చిత్రంలో తన గెటప్ ని షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అమితాబ్ రాజ గురువు పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ లుక్ మరియు సైరా గెటప్ లో మెగాస్టార్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

English summary
Amitabh Bachchan gets royal treatment by Chiranjeevi. Pawan kalyan meets Amitabh with family
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X