Just In
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'టైటానిక్' హీరోతో సూపర్ స్టార్ సినిమా
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్..త్వరలో 'టైటానిక్' హీరో లియోనార్డో డికాప్రియో తో కలసి నటించబోతున్నారు.డికాప్రియో ప్రధాన పాత్రలో నటించే చిత్రం 'ది గ్రేట్ గాట్స్‌బీ' చిత్రంలోకీ రోల్ కి అమితాబ్ ని ఎంపిక చేసారు. భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కే ఈ చిత్రం త్రీడీ సినిమా. ఇస్లా ఫిషర్ హీరోయిన్ గా చేసే ఈ చిత్రంలో అమితాబ్‌ది కీలక పాత్ర. మేయర్ వుల్ఫ్‌షీమ్ అనే పాత్రలో ఆయన కనిపిస్తారు. ఈ చిత్రానికి బజ్ లహ్రమన్ దర్శకత్వం వహిస్తారు. గతంలో ఆయన రూపొందించిన మౌలీన్ రూజ్, ఆస్ట్రేలియా చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందాయి. '... గాట్స్‌బీ'కి ఎఫ్.స్కాట్ ఫిట్జ్‌గెరాల్డ్ రాసిన నవల ఆధారం.
ఈ చిత్రంలో టోబీ మాగ్విరే, జోయల్ ఎడ్గెర్టన్, క్యారీ ముల్లిగాన్, ఎలిజబెత్ డిబికి తదితరులు నటిస్తున్నారు. తన మాతృదేశమైన ఆస్ట్రేలియాలోనే చిత్రీకరణ ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ''ప్రపంచంలోని గొప్ప నటుల్లో అమితాబ్ ఒకరు. ఆయన నా చిత్రంలో నటించేందుకు అంగీకరించడం ఎంతో ఆనందంగా ఉంది. అమితాబ్ చిత్రాలంటే నాకెంతో ఇష్టం. భారతీయ చిత్రాలపై అభిమానం ఏర్పడటానికి ఆయన నటించిన 'షోలే' చిత్రమే కారణం'' అన్నారు. ఇక వార్నర్ బ్రదర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గతంలోనూ ఆయనకు హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చినా ఆయన ఎప్పుడూ అటు వైపు చూడలేదు.ఇన్నాళ్ళకు 'ది గ్రేట్ గాట్స్‌బీ' సినిమాని ఓకే చేసారు. ఇక అమితాబ్ ..హాలీవుడ్ చిత్రం ఓకే చేయటంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తున తం అమితాబ్.. రామ్ గోపాల్ వర్మ డైరక్ట్ చేస్తన్న డిపార్టమెంట్ లో చేస్తున్నారు.